Breaking News

తానా అధ్యక్షుడిగా అంజయ్య చౌదరి లావు…

-“ఇంటికో పువ్వు అయితే ఈశ్వరుని కో మాల” అని నమ్మిన వ్యక్తి అంజయ్య చౌదరి లావు…
-రానున్న రోజుల్లో “తానా” కీర్తి బావుటా తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వతం
-తానా జీవితకాల సభ్యులు, తానా టీమ్ స్క్వేర్ వాలంటీర్ తరుణ్ కాకాని

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
“ఇంటికో పువ్వు అయితే ఈశ్వరుని కో మాల” అని ” ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న” అనే నానుడిని ప్రగాఢంగా విశ్వసించి సాటి మనిషికి సాయం పడుతూ, ప్రేమను పంచి తెలుగువారి బావుటను అమెరికాలో ఎగురవేసిన వారు అంజయ్య చౌదరి లావు అని న్యాయవాదుల అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్స్బిలిటీ అండ్ అవేర్ నెస్ (ఆస్రా) కృష్ణ జిల్లా అధ్యక్షుడు, అమరావతి బోటింగ్ క్లబ్ సిఇఒ, తానా జీవితకాల సభ్యులు, తానా టీమ్ స్క్వేర్ వాలంటీర్ తరుణ్ కాకాని అన్నారు. అగ్రరాజ్యం అమెరికాలో ప్రతిష్టాత్మకమైన అతిపెద్ద తెలుగు సంస్థ తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) నూతన అధ్యక్షుడిగా ( 2021-23) సోమవారం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బుధవారం తరుణ్ కాకాని ఓ ప్రకటన విడుదల చేసారు. ఈ సందర్భంగా తరుణ్ కాకాని మాట్లాడుతూ ఈరోజుల్లో ఖండాంతరాల అవతల కూడా కాసులకు అతీతంగా సేవలందించి అందరి మన్ననలను పొందుతున్న తెలుగుతేజం, కృష్ణా జిల్లా, పెద్ద అవుటపల్లి ముద్దుబిడ్డ అంజయ్య చౌదరి లావు అని అన్నారు. ఎన్ఆర్ఐ తల్లిదండ్రులు ఇండియా నుండి అమెరికా కి వెళ్లి ఇబ్బందులకు గురైతే వారికి అండగా నిలిచారు. వేర్వేరు ప్రమాదాల్లో మరణించిన వారి మృతదేహాలను భారత్ కు తీసుకురావడానికి తనవంతు కృషి చేస్తున్నారు. 2011 నుంచి 2013 వరకు తానా టీమ్ స్క్వేర్ ఛైర్మన్‌గా పనిచే సిన అంజయ్య చౌదరి తర్వాత కాలంలో ఎన్నో బాధ్యతలు చేపట్టారు. 2019 నుంచి 2021 వరకు తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వ హించారు. విజయవాడ మణిపాల్ హాస్పటల్ వైద్యబృందం సహకారంతో హృద్రోగ వైద్య శిబిరం ఏర్పాటు చేసి, గుండె వ్యాధులు ఉన్న వారిని గుర్తించి అవసరమైన వారికి ఆపరేషన్లు చేయించారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి వైద్యుల సహకారంతో క్యాన్సర్ వ్యాధి గ్రస్తులను గుర్తించి వారికి అవసరమైన వైద్య సహాయం అందించారు. జైపూర్ నుండి వికలాంగులకు అవసరమైన కృత్రిమ అవయవాలను తెప్పించి పంపిణీ చేయించారు. తన స్వగ్రామంలోనూ పలు సేవా కార్యక్రమాలు చేపట్టారన్నారు. అంజయ్య చౌదరి లావు ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో “తానా” కీర్తి బావుటా తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచి దశదిశలా వ్యాపిస్తుందన్నారు.

Check Also

వరద బాధితులకు విరాళాల వెల్లువ

-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *