Breaking News

ప్ర‌జ‌ల ఆరోగ్య‌మే ఎన్డీయే కూట‌మి ల‌క్ష్యం : ఎంపి కేశినేని శివ‌నాథ్

-న‌లుగురు ల‌బ్ధిదారుల‌కు సీఎం సహాయనిధి చెక్కులు అందజేత

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని ప్ర‌జ‌లంద‌రీ సంక్షేమం,అభివృద్ధితో పాటు ఆరోగ్య సంర‌క్ష‌ణ కూడా ఎన్డీయే కూట‌మి ల‌క్ష్య‌మ‌ని..ఆ విధంగానే కూట‌మి ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) అన్నారు. గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో ఎంపి కేశినేని శివ‌నాథ్ శుక్ర‌వారం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను అంద‌జేశారు. న‌లుగురు ల‌బ్ధిదారుల‌కు అంద‌జేశారు. విజయవాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని 4 గురికి రూ.4,71,894 లు మంజూరయ్యాయి. ఈ ల‌బ్దిదారుల్లో తిరువూరు నుంచి 3గురు, విజ‌య‌వాడ వెస్ట్ నుంచి ఒక‌రు వున్నారు.

యాక్సిడెంట్ కార‌ణంగా బ్రెయిన్ ఆప‌రేష‌న్ చేయించుకున్న సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.2,72,174 లు చెక్కును తిరువూరు నియోజ‌క‌వ‌ర్గం ఎ.కొండూరు మండ‌లం గొల్లమందల గ్రామానికి చెందిన బోజెడ్ల ఉషారాణికి సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.2,72,174 ల చెక్కును ఎంపి కేశినేని శివ‌నాథ్ అంద‌జేశారు.

అలాగే తిరువూరు ప‌ట్ట‌ణంలో బెస్తాబ‌జార్ కి చెందిన మునుకుంట్ల శ్రీనుకి సీఎంఆర్ఎఫ్ కింద రూ.1,43,502లు, గంప‌ల‌గూడెం మండ‌లం దుంద‌ర్ల‌పాడు గ్రామానికి చెందిన క‌ల‌సాని ల‌క్ష్మీకి సీఎంఆర్ఎఫ్ కింద రూ 26,218లు మంజూరైయ్యాయి. తిరుపూరు నుంచి చెక్కులు అందుకోవ‌టానికి రాలేక‌పోయిన మునుకుంట్ల శ్రీను, క‌ల‌సాని ల‌క్ష్మీకి వారి చెక్కుల‌ను తిరువూరు నాయ‌కులు అంద‌జేసి ల‌బ్ధిదారులకు అంద‌జేయాల్సిందిగా ఎంపి కేశినేని శివనాథ్ ఆదేశించారు

విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం 50వ డివిజ‌న్ గొల్ల‌పాలెం గ‌ట్టు క్వారీ ప్రాంతానికి చెందిన షేక్ సోహైల్ కి సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.30,000 చెక్కును ఆమె కుమారుడు షేక్ షాబాషి అందుకున్నారు.
ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) చెక్కులతోపాటు సీఎం చంద్రబాబు పంపించిన‌ సందేశ పత్రాలను కూడా అందజేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ రైతు సంఘం అధ్య‌క్షులు చెరుకూరి రాజేశ్వ‌ర‌రావు, గంప‌ల గూడెం మండ‌ల పార్టీ అధ్య‌క్షుడు రెగ‌ళ్ల వీరారెడ్డి, గంపలగూడెం మండలం తెలుగు యువత అధ్యక్షుడు మానుకొండ రామకృష్ణ (MRK) , తిరువూరు నియోజ‌క‌వ‌ర్గ తెలుగు యువ‌త వైస్ ప్రెసిడెంట్ షేక్ హుస్సెన్, టిడిపి నాయ‌కులు కామా దేవ‌రాజు, సంకె విశ్వ‌నాథం పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *