బెంగళూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కర్ణాటక 20వ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కొలువుతీరారు. ఆ రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ బొమ్మైతో బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముందు మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పతో కలిసి ఆయన రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. బసవరాజ బొమ్మై ఎంపికలో మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కీలకపాత్ర పోషించారు. అప్ప అత్యంత ఆప్తుల్లో ఒకరైన బసవరాజ బొమ్మై నాయకత్వాన్ని దాదాపు అందరూ ఆమోదించారు. శాసనసభాపక్ష సమావేశంలో ఆయన పేరును యడియూరప్ప ప్రతిపాదించగా మాజీ ఉపముఖ్యమంత్రి గోవింద కారజోళ ఆమోదం తెలిపారు. మంగళవారం వరకు దాదాపు పది మంది ఆశావహుల పేర్లు పరిశీలనలో ఉన్నా చివరకు ఈ పేరును అధిష్ఠానం ఖరారుచేసింది. ఇదే సందర్భంగా ముగ్గురు ఉపముఖ్యమంత్రులను నియమించారు. ఆర్.అశోక్, బి.శ్రీరాములు, గోవింద కారజోళ ఈ పదవులకు ఎంపికయ్యారు.
Tags bengulor
Check Also
జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …