– కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల విధులను నిర్వహించే సూక్ష్మ పరిశీలకులు నేరుగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు, సాధారణ పరిశీలకులకు జవాబుదారీతనం కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పీ ప్రశాంతి స్పష్టం చేశారు. శనివారం ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో మైక్రో అబ్జర్వర్స్ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ పీ ప్రశాంతి మాట్లాడుతూ, గ్రాడ్యుయేట్ ఎన్నికల కోసం నియమించిన పరిశీలకులు మూడు నాలుగు జిల్లాలలో చెందిన ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షణ చెయ్యడం జరుగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో అన్ని చోట్ల తిరిగి పర్యవేక్షణ సాధ్యం కాదని, వారి తరపున మైక్రో అబ్జర్వర్లు విధులను నిర్వహిస్తూ ఎక్కడైనా కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనలు జరిగినా, ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం ఉల్లంఘించిన సంబంధించిన సమాచారాన్ని సీల్డ్ కవర్లో పెట్టి సాధారణ పరిశీలకుల దృష్టికి తీసుకెళ్లి గురుతరమైన బాధ్యత వహించాల్సి ఉంటుందని కలెక్టర్ ప్రశాంతి స్పష్టం చేశారు.
ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనల పై మాస్టర్ ట్రైనర్స్ అవగాహన కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. శిక్షణ కార్యక్రమం లో భాగంగా అందచేసిన మెటీరియల్స్ క్షుణ్ణంగా పునః చ్చరన చేసుకోవాలని తెలిపారు. ఎటువంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవాలన్నారు. ఎన్నికల ను విజయవంతం పూర్తి చెయ్యడం లో మైక్రో అబ్జర్వర్స్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు.
ఈ సమావేశంలో రాజమండ్రి ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్ , కే ఆర్ ఆర్ సి డిప్యూటీ కలెక్టర్ కే భాస్కర్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్లు వి , త్రినాథ్ కుమార్, ఎం ఎస్ రేఖ, జే ఏ రాము, కే రాజ్, ఎన్ శ్రీనివాస్, కే రమేష్ నాయుడు, ఎలక్షన్ సూపరింటెండెంట్ ఎన్ లావణ్య, డి టి బి కృష్ణ శాస్త్రి, మైక్రో అబ్జర్వర్స్, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News