Breaking News

కూరగాయలు,మిర్చి ధరల స్థిరీకరణకు పిటిష్ట చర్యలు : సిఎస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పచ్చిమిరప,ఎండు మిరప పంటలు సహా వంగ,టమాటా తదితర కూరగాయలు ధరల స్థిరీకరణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ చెప్పారు.కూరగాయలు,ఇతర పంటల ధరల మానిటరింగ్ పై శనివారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి వ్యవసాయ,మార్కెటింగ్, పౌర సరఫరాలు,మార్క్ ఫెడ్ శాఖల అధికారులతో వీడియో సమావేశం నిర్వహించి ప్రస్తుతం ఆయా పంటలకు మార్కెట్లో రైతులకు అందుతున్న ధరల వివరాలను సమీక్షించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా పంటలు పండించిన రైతులకు కనీస ధర వచ్చేలా చూడడంతో పాటు వినియోగదారులకు కూడా కనీస ధరలకు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ఉందని అన్నారు.ఆరుగాలం శ్రమించి పండించిన రైతుకు ఎట్టి పరిస్థితుల్లోను పంటకు కనీస మద్ధత్తు లభించాలని ఆదిశగా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు,వ్యవసాయ,మార్కెటింగ్, ఫౌర సరఫరాలు,మార్క్ ఫెడ్ అధికారులు సమన్వయంతో పనిచేసి టమాటా,వంగ తదితర కూరగాయలు,పచ్చిమిరప,ఎండు మిరప పండించే రైతులకు తగిన కనీస ధర లభించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ధరల హెచ్చు తగ్గులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అటు రైతులకు ఇటు వినియోగదారులకు ఇబ్బందులు లేని రీతిలో ధరలు ఉండే విధంగా చూడాలని సిఎస్ ఆదేశించారు.
మార్కెట్ ఇంటర్వెన్సన్ కింద అధిక ఉత్పత్తులు గల ప్రాంతాల్లో ధరలు పడిపోవడం సరఫరా లేని చోట్ల అధిక ధరలు అధికంగా ఉండే పరిస్థితులు ఉంటాయని కావున అలాంటి సందర్భాల్లో నుండి ఉత్పత్తి తక్కువ ఉన్న ప్రాంతాలకు ముఖ్యంగా రైతు బజారులకు తరలించడం ద్వారా కొంత వరకూ ధరల స్థిరీకరణకు అవకాశం ఉంటుందని ఆదిశగా తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు.అగ్రివాచ్ తో పాటు రియల్ టైమ్ గవర్నెస్ అనుసంధానంతో ఎప్పటికప్పుడు కూరగాయలు ధరలను పర్యవేక్షించాలని ఆదేశించారు. కనీస మద్ధత్తు ధర రాని పరిస్థితులు నెలకొన్నప్పుడు మార్కెట్ ఇంటర్వెన్సన్ కింది ప్రభుత్వ పరంగా ధరల స్థిరీకరణ కింద రైతులను ఆదుకోవడం తోపాటు వినియోగ దారులకు కూడా కనీస ధరలకు అందుబాటులో ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని సిఎస్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని రైతు బజారులన్నీ మరింత చురుగ్గా వ్యవహరించేలా చర్యలు తీసుకోవడంతో పాటు ధరల పర్యవేక్షణ వ్యవస్థ మరింత సమర్ధవంతంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.ఎట్టి పరిస్థితుల్లోను రైతులు గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బందులు పడడానికి వీలులేదని ఇందుకు ప్రభుత్వం తగిన విధంగా రైతులకు అండగా ఉంటుందనే భరోసాను రైతుల్లో కల్పించాలన్నారు.అనంతరం మార్కెటింగ్,ఫౌరసరఫరాల శాఖల అధికారులతో ప్రస్తుతం కూరగాయలు,మిర్చి తదితర పంటలకు రైతులకు లభిస్తున్న ధరల వివరాలను సిఎస్ అడిగి తెల్సుకున్నారు.
యూకలిప్టస్,సుబాబుల్ రైతులకు తగిన మద్ధత్తు ధర వచ్చేలా చర్యలు చేపట్టండి.
రాష్ట్రంలో యూకలిప్టస్,సుబాబుల్ పండించే రైతులకు కనీస మద్ధత్తు ధర వచ్చేలా ఐటిసి తదితర సంస్థలతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ విజయానంద్ పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ ను అధికారులను ఆదేశించారు.సుబాబుల్, యూకలిప్టస్ ప్రధానంగా పేపరు తయారీలో వినయోగిస్తారని కావున భద్రాచలం ఐటిసి, ఇతర పేపర్ తయారీ పరిశ్రమలతో మాట్లాడి టన్నుకు కనీస మద్ధత్తు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రస్తుతం సుబాబుల్ టన్నుకు 5వేల 400 రూ.లు, యూకలిప్టస్ టన్నుకు 4400 వరకూ కనీస మద్ధత్తు ధర లభిస్తోందని అధికారులు వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజారుల్లో సబ్జీ కూలర్లు ఏర్పాటుకు చర్యలు…
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు బజార్లుల్లో సబ్జీ కూలర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు.ఇప్పటికే కొన్ని రైతు బజారుల్లో ప్రయోగాత్మకంగా వీటిని ఏర్పాటు చేయగా మిగతా రైతు బజార్లన్నిటిలో ఈసబ్జీ కూలర్లను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు,ఈ సబ్జీ కూలర్లు విద్యుత్ లేకున్నా నీటితో కూడా పనిచేసే విధంగా ఆధునిక సాంకేతికతతో రూపొందించారని తెలిపారు.ప్రతి రైతు బజారులో కనీసం ఒకటి,పెద్ద రైతు బజారులైతే ఒకటికి మించి వీటిని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ మరియు రైతు బజారుల విభాగం అధికారులను ఆదేశించారు.వీటిని ఏర్పాటు చేయడం వల్ల కూర గాయలు,పండ్లను పాడవకుండా తాజాగా ఉంచడంతో పాటు ఆరోజు అమ్ముడు పోకుండా మిగిలిన వాటిని మరుచటి రోజు అమ్ముకునేందుకు ఇవి దోహదపడతాయని చెప్పారు.
ఈసమావేశానికి వర్చువల్ గా పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ మాట్లాడుతూ మార్కెటింగ్ శాఖ ఇప్పటికే 59 సబ్జీ కూలర్లకు ఆర్డర్ పెట్టిందని మరిన్ని ఆర్డర్ పెట్టి 112 రైతు బజారుల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారన్నారు.
ఈవీడియో సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు,వాణిజ్య శాఖ కార్యదర్శి డా.ఎన్.యువ రాజ్,పౌరసరఫరాల శాఖ కమీషనర్ సౌరవ్ గౌర్,వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మరియు రైతు బజారుల సిఇఓ విజయ సునీత,మార్క్ ఫెడ్ ఎండి డా.మనజీర్ జిలానీ సమూన్,ఉద్యానవన శాఖ డైరెక్టర్ డా.కె.శ్రీనివాసులు వర్చువల్ గా పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *