-ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్ )కు వచ్చు అర్జీలను నాణ్యతతో పరిష్కారం : స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవేంద్ర రెడ్డి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో (పి జి ఆర్ ఎస్ ) కార్యక్రమంలో వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారం చూపాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవేంద్ర రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి జి ఆర్ ఎస్) లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలను స్వీకరించారు. పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగాపరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తో పాటు జి ఎన్ ఎస్ ఎస్ డిప్యూటీ కలెక్టర్ సుధా రాణి, డిఆర్డిఎ పిడి శోభన్ బాబు తదితర అధికారులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.
వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి, ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు.
శాఖల వారీగా అర్జీల వివరాలు :
రెవెన్యూ -161, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ-5, విద్యుత్ శాఖ- 4, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్- 10, దేవాదాయ శాఖ-1, సర్వే ల్యాండ్ రికార్డ్స్ -9 , టీటీడీ-3, పంచాయతీరాజ్ -10, బీసీ కార్పొరేషన్ -8, పోలీస్ శాఖ-9, రోడ్స్ అండ్ బిల్డింగ్ -3, SERP -1, పౌరసరఫరాల శాఖ -2, వికలాంగుల శాఖ-1, గృహ నిర్మాణ శాఖ- 1, విద్యాశాఖ-2, GSWS -1, ఆర్టీసీ-1, రూరల్ డెవలప్మెంట్ -3, నీటిపారుదల శాఖ-1, ఎక్సైజ్ శాఖ-1, నేషనల్ హైవే -1 వెరసి మొత్తం 238 వినతులు రావడం జరిగిందని సంబంధిత అధికారులు అందరు వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరయిన వివిధ శాఖలకు సంబందించిన జిల్లా అధికారులను ఆదేశించారు.
Prajavartha Online Telugu News