విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ హాల్ నందు మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన నూతన అస్తి పన్ను విధింపుపై జరిగిన సర్వ సభ సమావేశంలో జీవో198 కౌన్సిల్ ఆమోదించింది. తొలుత కౌన్సిల్ సమావేశంలో నూతన ఆస్తి పన్ను విధింపు విధి విధానాలను నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ సభ్యలుకు వివరించడం జరిగింది. బలహీనుడు, బలవంతుడు, పేద, ధనిక అన్న తేడా లేకుండా, రాజకీయ సిఫార్సులకు, అవినీతి ఆస్కారం లేకుండా అందరికీ యూనిఫాంగా ఉండే విధంగా, అద్దె ఆధారిత పన్నును పక్కనపెట్టి, ఆస్తి విలువ ఆధారిత పన్నులు ప్రవేశపెట్టామని తెలిపారు. ఈ విధానం వల్ల 375 చదరపు అడుగుల లోపల నివాస గృహాల్లో ఉండే పేదలకు సంవత్సరానికి పన్ను కేవలం రూ. 50 మాత్రమేనని చెప్పారు. ఆస్తి విలువ ఆధారితంగా పన్నులు నిర్ణయించాలని ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుని, దాన్ని చట్టం చేసిందన్నారు. ఈ నూతన విధానం లోపభూయిష్టంగా ఉన్న పన్నుల వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గాడిలో పెట్టారని చెప్పారు. నూతన ఆస్తి పన్ను విధానంపై ప్రతిపక్షాలు అర్థంపర్థంలేని విమర్శలు చేస్తున్నాయన్నారు. దేశం అంతా ఒకే విధానం ఉండాలి, చిన్నవారైనా, పెద్దవారైనా, బలహీనుడైనా, బలవంతుడైనా అందరికీ ఒకే విధానం ఉండాలన్న రీతిలో.. ఆస్తి విలువ మీద పన్ను విధానం తీసుకొచ్చాం అన్నారు.
Tags vijayawada
Check Also
వరద బాధితులకు విరాళాల వెల్లువ
-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు …