Breaking News

ఆంధ్ర ప్రదేశ్ భవన, ఇతర నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు చైర్మన్ గా గుమ్మనూర్ జయరాం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గుమ్మనూర్ జయరాం కార్మిక శాఖ మంత్రి  బుధ‌వారం “ఆంధ్ర ప్రదేశ్ భవన, ఇతర నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు చైర్మన్ గా” పదవిని చేపట్టారు. చేపట్టిన వెంటనే CESS వసూలు పై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కార్మిక, కర్మాగారాలు,
బాయిలర్లు మరియు బీమా వైద్య సేవల శాఖ, కార్మిక శాఖ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు, ఉమ్మడి కమిషనర్లు మరియు ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో CESS వసూలు పెంచడానికి అధికారులకు దిశా నిర్దేశం చేసారు. ఈ సందర్భంగా ప్రతి భవన మరియు ఇతర నిర్మాణ సంస్థలలో పనిచేసే నిర్మాణ కార్మికులకు భద్రత, ఆరోగ్యం, సంక్షేమం మరియు సామాజిక భద్రతా చర్యలను తీసుకుంటాం అని మంత్రి  తెలియ చేసారు. ఈ బోర్డులో ఇప్పటివరకు సుమారు 20 లక్షల భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు లబ్ధిదారులుగా నమోదు చేయబడ్డారు అలాగే నమోదు చేసుకోని భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులని గుర్తించి, వారిని కూడా లబ్ధిదారులుగా నమోదు చేస్తాం అని మంత్రి గారు తెలియ చేసారు. పూర్తి స్థాయిలో CESS కూడా వసూలు చేస్తాము అని మంత్రి తెలియ చేసారు. క్రిందటి ఆర్థిక సంవత్సరం 2020-21 లో CESS సేకరణ క్రింద రూ.294,82,31,624/- (రెండు వందల తొంబై నాలుగు కోట్ల ఎనభై రెండు లక్షల ముపై ఒక వేల ఆరు వందల ఇరవై నాలుగు రూపాయలు) వసూలు చేయడం జరిగింది అని, ఈ ఆర్థిక సంవత్సరం 2021-22లో (ఏప్రిల్, 2021 నుండి జూన్, 2021 వరకు) CESS సేకరణ క్రింద రూ.74,89,43,877/- (డెభై నాలుగు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల నలభై మూడు వేల ఎనిమిది వందల డెభై ఏడు రూపాయలు) వసూలు చేయడం జరిగింది అని మంత్రి గారు తెలియ చేసారు. మన ముఖ్య మంత్రి  జగన్ మోహన్ రెడ్డి  తనకు ఈ బాధ్యత అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలియ చేస్తూ, ఆయన ఆశయాలు, సంక్షేమ పథకాలు – ప్రతి భవన నిర్మాణ కార్మికుడుకి అందే విధంగా కృషి చేస్తాను అని ఈ సందర్భంగా మంత్రి తెలియ చేసారు.

Check Also

జిల్లాలో తొలిరోజు 23 రెవిన్యూ సదస్సులు నిర్వహించాం

-జెసి చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం రైతుల, ప్రజల భూసమస్య ల నిర్ణీత కాలంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *