Breaking News

నాట్యకళకు ఆకర్షితులు కానివారు అత్యంత అరుదు : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
భారతీయ నాట్యరీతులు దేశ విదేశాలలో విశేష ప్రాచుర్యాన్ని పొంది భారతీయుల గౌరవాన్ని ఇనుమడింప చేశాయని, ముఖభావాలు చూపుతూ నటనమాడే ఈ మహోన్నతమైన కళకు ఆకర్షితులు కానివారు అత్యంత అరుదని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) నిర్వచించారు.
బుధవారం  తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆయన ముఖాముఖిగా, బిగ్ స్క్రీన్ ద్వారా పలుకరించి ప్రజలు పడుతున్న ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని నాని అక్కడికక్కడే పరిష్కారం చూపించారు.
తొలుత స్థానిక ఈడేపల్లికి చెందిన ఇంటర్మీడియేట్ విద్యార్థిని శాస్త్రీయ నృత్య కళాకారిణి చెన్నూరు పూర్ణ చంద్రిక ఇటీవల గురు పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్ బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఆల్ ది బెస్ట్ ఆర్ట్ అకాడమీ 16 వ వార్షికోత్సవంలో విశిష్ట ప్రతిభా పురస్కారాల ప్రధాన మహోత్సవంలో నృత్య రత్న పురస్కారం – 2021 ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గా చెన్నూరు పూర్ణ చంద్రిక తన తండ్రి చెన్నూరు శ్రీనివాస్, సోదరుడితో కలిసి మంత్రి కార్యాలయం వద్దకు వచ్చి తనకు వచ్చిన పురస్కారం, జ్ఞప్తిక మంత్రి పేర్ని నాని దంపతులకు చూపించారు. అనంతరం వారి ఆశీర్వాదం తీసుకొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భాష, నాట్యం రెండూ భావవ్యక్తీకరణ కోసం వినియోగించే ఉపకరణాలే అని చెబుతూ, ఈ రెండూ మనిషి బుద్ధి వికాసానికి దోహదపడేవేనని అన్నారు. విద్యలోనూ అత్యధిక మార్కులు సాధించి కెరీర్ ఉన్నతంగా మలుచుకోవాలని పూర్ణచంద్రికకు మంత్రి సూచించారు.
మచిలీపట్నం మండలం నెలకుర్రు గొల్లపాలెం గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు మంత్రిని కలిశారు. తమ ప్రాంత ప్రజల దాహార్తి తీర్చేందుకు వరల్డ్ విజన్ సంస్థ గతంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారని ప్రస్తుతం అది పాడైపోవడంతో తాగునీటికి ఇబ్బంది పడుతున్నట్లు సర్పంచ్ బండి దేవానందం, మరికొందరు గ్రామస్తులు మంత్రికి విన్నవించారు. స్పందించిన అయన మీ గ్రామంలో నూతన ఆర్ ఓ ప్లాంట్ తప్పక ప్రారంభిద్దామని అన్నారు.
స్థానిక చిలకలపూడి 7 వ డివిజన్ కు చెందిన కుంభం విజయలక్ష్మి మంత్రికి తన సమస్యను చెప్పింది. తనకు గతంలో ఒక బడ్డీ కొట్టు ఉండేదని, రోడ్డు విస్తరణ పనుల్లో ఆ బడ్డీని అధికారులు తొలగించారని, మరల ఆ సమీపంలో వాటర్ ప్లాంట్ సమీపంలో తిరిగి బడ్డీకొట్టు పెట్టుకొందామని అనుకొంటుంటే మునిసిపాలిటీ లైసెన్స్ లేకుండా వీలుకాదని అధికారులు తేల్చి చెబుతున్నారని ఆమె మంత్రికి ఆరోపించింది. స్థానిక పాత రామన్న పేటకు చెందిన పంతాల రంగనాయకమ్మ మంత్రికి తన కష్టాలను చెప్పింది. తన భర్తతో అయిదు సంవత్సరాల క్రితం విడాకులు తీసుకున్నానని తనకు ఇద్దరు పిల్లలు వున్నారని కుటుంబపోషణ ఎంతో భారంగా ఉందని ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని కోరింది.
స్థానిక బచ్చుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అర్చకునిగా పనిచేసే తన భర్త ముక్తేవి శ్రీనివాస మూర్తి 2018 లో చనిపోయారని అర్చక సంక్షేమనిధి నుంచి డబ్బులు ఇంకా రాలేదని ఆ మొత్తం వచ్చేలాగున సహాయం చేయాలనీ మంత్రి పేర్ని నానిని ముక్తేవి జయప్రద కోరారు .
స్థానిక గొడుగుపేట ( 40 వ డివిజన్ ) కు చెందిన చీదర శ్రీధర్ మంత్రి పేర్నినానిని కలిసి తనకు ఉద్యోగం ఇప్పించాలని కోరారు. 1989 లో సివిల్ ఇంజినీరింగ్ లో డిప్లొమా చేశానని ఆఫ్రికాలోని టాంజానియా దేశంలో నాలుగేళ్లు , హైదరాబాద్ లో నిర్మాణ రంగంలో ఉద్యోగం చేసిన అనుభవం ఉందని తనకు ఇద్దరు ఆడపిల్లలు చదువుకొంటున్నారని తమ కుటుంబం ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని తన అవకాశం ఎక్కడైనా వచ్చేలా సహాయం చేయాలనీ శ్రీధర్ మంత్రిని అభ్యర్ధించారు.

Check Also

వరద బాధితులకు విరాళాల వెల్లువ

-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *