గ్రామాల్లో రోజువారీ కార్యక్రమాలు నిర్వహణలో ఎక్కడా లోపం లేకుండా చూడవలసిన బాధ్యత ఆ గ్రామ పంచాయితీలదే… : ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు

కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామాల్లో రోజువారీ కార్యక్రమాలు నిర్వహణలో ఎక్కడా లోపం లేకుండా చూడవలసిన బాధ్యత ఆ గ్రామ పంచాయితీలదేనని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో మండలంలోని శృంగవరపాడు గ్రామ పెద్దలు ఎమ్మెల్యే ని కలసి గ్రామ సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ యొక్క శృంగవరపాడు గ్రామానికి రూ. 96.70 లక్షలు రూపాయలు నిధులు మంజూరు చేశాం అని, గ్రామంలో నూతనంగా సచివాలయం, ఆర్బీకే, వెల్నెస్ సెంటర్ నిర్మాణాలు త్వరగతిన పూర్తి చేయాలని, అదేవిదంగా గ్రామాలలో ప్రజల ఆరోగ్యం పైన ద్రుష్టి పెట్టాలని, గ్రామంలో ఎక్కడ కూడా నీరు నిల్వ లేకుండా, కచ్చా డ్రైన్స్ త్రవ్వించి, పూర్తిగా బ్లీచింగ్ -సున్నం చల్లించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల జగన్నాధం, నేపాల పోతురాజు, బలే మారయ్య, బలే వెంకటేశ్వరరావు, బలే సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

4వేల ఎక‌రాల ల్యాండ్ బ్యాంక్ ఉంది

-పామాయిల్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్స‌హిస్తున్నాం -త‌ల‌స‌రి ఆదాయం రూ.4ల‌క్ష‌ల‌కుపైగా సాధాన ల‌క్ష్యం -ఏలూరు జిల్లా క‌లెక్ట‌ర్ వెట్రిసెల్వి అమ‌రావ‌తి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *