Breaking News

వలస దారులపై ట్రంప్‌ ప్రభుత్వ తీరు ఆక్షేపణీయం

-సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అక్రమ వలసదారుల పేరుతో యువతను అమెరికా ప్రభుత్వం క్రూరమైన పద్ధతుల్లో జంతువులను, నేరస్తులను వేటాడుతున్న తీరులో ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్‌ ప్రభుత్వం వలస దారులను తిప్పి పంపే పేరుతో చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఈ మేరకు అమెరికా పార్లమెంటు ముందు నుంచి ఆదివారం ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ట్రంప్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కక్షగట్టినట్టు వలస దారులను జంతువుల తరహాలో వేటాడటాన్ని ఆక్షేపించారు. అక్రమ వలస దారులను తిప్పి పంపడాన్ని తాము వ్యతిరేకించడంలేదని అన్నారు. భారత ప్రభుత్వం కూడా అమెరికాలో ఉన్న భారతీయ వలస దారులను వెనక్కు తీసుకుంటామని ప్రకటన చేసిందని గుర్తుచేశారు. అయితే ట్రంప్‌ ప్రభుత్వం వలస దారులని తిప్పి పంపడానికి ఎన్నుకున్న విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. భారత ప్రధాని మోదీ అమెరికాకు వచ్చి ట్రంప్‌తో చర్చలు జరిపిన మరుసటి రోజు నుంచీ..అదే రీతిలో జంతువులను వేటాడినట్లు వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిరచారు. ఆమెరికాలో ఉన్న వలస దారులు ఉన్నట్టుండి వచ్చిన వారు కాదని, దశాబ్దకాలంగా అక్కడ ఉంటున్నారని వివరించారు. యువతను దేశానికి పంపడానికి చేస్తున్న చర్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, అమెరికా ప్రభుత్వ తీరుతో యువత జీవితం నాశనమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వలస దారులను గుర్తించడం వారికి కొంత సమయం ఇచ్చి సుహృద్భావ వాతావరణంలోను, తగినంత సమయం ఇచ్చి తిప్పి పంపే ఏర్పాటు చేసి ఉండాల్సిందని హితవు పలికారు. ఒక విధాన పరంగా యువతలను పంపితే బాగుండేదని, అలా కాకుండా యువతను వేధించి వెంటాడుతున్న తీరును నారాయణ తీవ్రంగా ఖండిరచారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *