రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా స్థాయి ఇసుక కమిటీ ఛైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ , తూర్పు గోదావరి జిల్లా వారి ఆదేశానుసారం జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అధికారి, రాజమహేంద్రవరం, టాస్క్ ఫోర్స్ S.I మరియు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, కొవ్వూరు వారు సంయుక్తంగా 24.02.2025న ఇసుక రవాణా చేసే వాహనాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నల్లజెర్ల వద్ద తనిఖీ చేస్తున్నప్పుడు, చెల్లుబాటు అయ్యే వే బిల్లు లేకుండా మరియు అనుమతించబడిన సామర్థ్యం కంటే ఎక్కువ లోడ్‌తో ఇసుకను రవాణా చేస్తున్న 08 వాహనాలను గుర్తించి తదుపరి చర్యల నిమిత్తం స్టేషన్ హౌస్ ఆఫీసర్, నల్లజెర్ల వారికి స్వాదీన పరచడమైనదని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి సోమవారం ఒక ప్రకటన లో పేర్కొన్నారు.
. వాహన వివరాలు క్రింద తెలుపడమైనది.
క్రమ సంఖ్య
వాహన నెంబర్
వాహన సామర్థ్యం
ఓవర్ లోడ్ పరిమాణం
MVI విధించిన జరిమానా (రూ.లలో)
1. AP37 TF 2333 – 10 Tyres
29000 Kgs అపరాధ రుసుం రూ.78000/-
2. AP39VC 0004 – 10 Tyres
27000 Kgs అపరాధ రుసుం రూ.74000/-
3. AP39 UQ 1143 – 10 Tyres
15000 Kgs & No licence, No tarpaulin అపరాధ రుసుం రూ.58000/-
4. AP39 UJ 1296 – 10 Tyres
28000 Kgs అపరాధ రుసుం రూ.76000/-
5. AP39 VF 9099 – 10 Tyres
30000 Kgs అపరాధ రుసుం రూ.80000/-
6. AP05TE 0003 – 10 Tyres
25000 Kgs అపరాధ రుసుం రూ.70000/-
7. AP39VE 0003 – 10 Tyres
32000 Kgs అపరాధ రుసుం రూ.84000/-
8. AP39 UN 0143 – 10 Tyres
12000 Kgs & No licence, No tarpaulin అపరాధ రుసుం రూ.52000/-
మొత్తం రూ.5,72,000/-
నిబంధనలకు విరుద్దంగా కుమారదేవం ఇసుక ర్యాంపు నుండి రాత్రి వేళలో లోడు చేయబడినట్లు ప్రాధమిక విచారణలో తెలియవచ్చినది. G.O.Ms. No. 43, తేదీ 08.07.2024 ప్రకారం బిల్లు లేకుండా ఇసుక రవాణా చేయుట నేరం మరియు అపరాధ రుసుము చెల్లించవలెను. తదుపరి పూర్తి విచారణ అనంతరం అక్రమ ఇసుక రవాణాకు బాధ్యులైన వ్యక్తుల పై చర్యలు తీసుకోబడతాయి. జిల్లా పరిధిలో అక్రమ ఇసుక త్రవ్వకం లేదా రవాణా చేసిన యెడల బాధ్యులైన వ్యక్తుల పై కఠిన చర్యలు తీసుకోబడతాయి.
Prajavartha Online Telugu News