Breaking News

మద్యం దుకాణాలను 48 గంటలపాటు మూసి ఉంచాలి..

– ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 27న కృష్ణా-గుంటూరు జిల్లాల శాస‌న మండ‌లి ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు వీలుగా జిల్లా పరిధిలో ఎక్క‌డా మ‌ద్యం అమ్మ‌కాలు జ‌ర‌క్కుండా అన్ని ర‌కాల మ‌ద్యం దుకాణాల‌ను 48 గంటలపాటు మూసి ఉంచాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ సోమ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ప్ర‌జా ప్రాతినిధ్య చ‌ట్టం-1951లోని సెక్ష‌న్ 135 సీ ప్ర‌కారం ఈసీఐ, ఏపీ చీఫ్ ఎల‌క్టోర‌ల్ ఆఫీస‌ర్ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ఈ ఆదేశాలివ్వ‌డం జ‌రిగింద‌ని.. ఈనెల 25వ తేదీ సాయంత్రం 4 గంట‌ల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు డ్రై డే అమ‌ల్లో ఉంటుంద‌న్నారు. మ‌ద్యం అమ్మ‌కాల నిషేధ ఉత్త‌ర్వుల క‌చ్చిత అమ‌లుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లా ప్రొహిబిష‌న్‌, ఎక్సైజ్ శాఖ అధికారిని ఆదేశించిన‌ట్లు క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *