ఫీవర్ సర్వే పటిష్టంగా చేపట్టడం ద్వారానే కోవిడ్ వైరస్ వ్యాప్తిని నివారించవచ్చు : జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్. శివశంకర్.

పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్ వైరస్ వ్యాప్తిని నియంత్రించాలంటే ఫీవర్ సర్వే సక్రమంగా చేపట్టమొక్కటే మార్గమని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్. శివశంకర్ అన్నారు. పెనమలూరు మండలం పెదపులిపాక గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్నగ్రామ సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం భవన పనులు గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శివశంకర్ గ్రామ సచివాలయాన్ని పరిశీలించి, ప్రజలకు అందుతున్న సేవలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గ్రామ సచివాలయంలో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ కరోనా మూడవ వేవ్ హెచ్చరిక నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణపై అధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వాలంటీర్లు, వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే తప్పనిసరిగా చేపట్టాలని, సర్వేలో జ్వరం, జలుబు లక్షలతో బాధపడున్న వారికి కరోనా పరీక్షలు చేయించాలన్నారు. పాజిటివ్ వచ్చినవారికి హోమ్ ఐసోలేషన్ లేదా కోవిద్ ఆసుపత్రులలో చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. హోమ్ ఐసొలేషన్ లో ఉన్నవారికి మందులతో పాటు, చికిత్స పరమైన సూచనలు అందించాలన్నారు. గ్రామ/వార్డ్ వాలంటీర్లు తమ పరిధిలోని ప్రతీ ఇంటిలోనూ కోవిడ్ పేషెంట్ లు ఉన్నారో, లేదో అనే విషయాన్నీ పరిశీలించి, నివేదిక అందించాలన్నారు. అంతేకాక నిరుపేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వారికీ తెలియజేసి, అర్హులు దరఖాస్తు చేసుకునేందుకు సహకరించాలన్నారు. సచివాలయ సిబ్బంది తమ విధి నిర్వహణలో ఏదైనా సమస్య ఎదురైతే వాటి పరిష్కారానికి సంబంధిత సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. గ్రామ సచివాలయంలో రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు. ధ్రువీకరణ పత్రాల జారీ కోసం దరఖాస్తు చేసుకునే వారికీ నిర్ణీత సమయంలోగా జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం గ్రామంలోని పాఠశాలలో నాడు-నేడు కార్యక్రమం కింద జరుగుతున్నా పనులను జాయింట్ కలెక్టర్ శివశంకర్ పరిశీలించారు.జాయింట్ కలెక్టర్ వెంట తహసీల్దార్ భద్రు, ఎంపిడిఓ విమాదేవి, విద్య శాఖ,సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

జాబ్ మేళా

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి లోని గవర్నమెంట్ ఐటిఐ కళాశాల, పద్మావతి పురం నందు జాబ్ మేళా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *