Breaking News

జిల్లాలో రెండుదఫాలు ప్రత్యేక “ రైతు స్పందన ‘ కార్యక్రమం… : కలెక్టరు జె. నివాస్


-ప్రతి నెలా మొదటి మూడవ బుధవారం రైతుస్పందన…
-కేవలం రైతుల సమస్యల పరిష్కారానికే • రైతు స్పందన ‘ నిర్వహణ…
-ఇ-క్రాప్ బుకింగ్ ఫీవర్ సర్వే బయోమెట్రిక్ లపై మరింత శ్రద్ధ పెట్టాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రైతులకు ఎదురైన సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు జిల్లాలో ప్రత్యేక ‘ రైతు స్పందన’ కార్యక్రమాన్ని ప్రతీనెలా మొదటి, మూడవ బుధవారాల్లో నిర్వహించనున్నట్లు జిల్లాకలెక్టరు జె. నివాస్ తెలిపారు. జిల్లాలో నిర్వహిస్తున్న ఇ-క్రాప్ బుకింగ్, ఫీవర్ సర్వే, బయోమెట్రిక్, సచివాలయాల నిర్వహణ, తదితర అంశాలపై జిల్లా కలెక్టరు జె.నివాస్, జాయింట్ కలెక్టర్లు కె. మాధవిలత, యల్. శివశంకర్‌లతో కలిసి గురువారం సాయంత్రం విజయవాడలోని ఆయన క్యాంపు కార్యాలయం నుండి మండల స్థాయి అధికారులతో వీడియోకాన్ఫరెన్సు నిర్వహించారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కలెక్టరు మాట్లాడుతూ వ్యవసాయ పనులు వేగవంతమైన ఈతరుణంలో రైతులు ఎదుర్కుంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించి రైతాంగానికి మేలు చేయాలనే ఉద్దేశ్యంతో ప్రత్యేక ‘ రైతు స్పందన ‘ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. స్పందన కార్యక్రమానికి వ్యవసాయ, ఉద్యాన, జలవనరులు, విద్యుత్, రెవెన్యూ, తదితర శాఖల అధికారులు తప్పక హాజరై రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 3 లక్షల మంది రైతులను రిజిస్ట్రేషన్ చేసి వారి పంటలను ఇ-క్రాప్ బుకింగ్ లో నమోదు చేయాలనే లక్ష్యంకాగా ఇప్పటివరకూ సుమారు 50 వేలమంది రైతుల పంటలను నమోదు చేయడం జరిగిందన్నారు. ఇ-క్రాప్ జరగకపోవడం వలన రైతుభరోసా పొందలేకపోయామని ఏఒక్క రైతూ బాధ పడకుండా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతు పేర్లను రిజిస్ట్రేషన్ చేసి వెంటనే రశీదులు జన రేట్ చేయాలని క్షేత్రస్థాయిలో పర్యటించి ఇ-క్రాప్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు. ప్రతీనెలా మొదటి శుక్రవారం గ్రామస్థాయిలో రెండవ శుక్రవారం మండల స్థాయిలో అగ్రికల్చరల్ అడ్వయిజరీ బోర్డు సమావేశాలను ఖచ్చితంగా నిర్వహించి అక్కడ పరిష్కారం కాని సమస్యలను జిల్లా స్థాయిలో మూడవ శుక్రవారం నిర్వహించే అగ్రికల్చరల్ అడ్వయిజరీ బోర్డు సమావేశం దృష్టికి తీసుకురావాలన్నారు. కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ఫీవర్ సర్వేపై మరింత ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రతీరోజూ వాలంటీర్లు ఫీవర్ సర్వే తప్పక నిర్వహించాలన్నారు. కొన్ని మండలాల్లో ఫీవర్ సర్వేలో జ్వరబాధితులు లేన్నట్లు రిపోర్టుల్లో చూపిస్తున్నారని, అదే మండలంలో 10 నుంచి 15 పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని ఇటువంటివి పునరావృతం కాకుండా సర్వేను పటిష్టంగా నిర్వహించి టెస్టుల సంఖ్య పెంచాలన్నారు. సచివాలయాల్లో ప్రభుత్వ పధకాలు వాటికి సంబంధించిన గైడ్ లైన్స్ తెలుపుతూ ఏర్పాటుచేసిన డిస్ ప్లే బోర్డులు అన్ని సచివాలయాల్లో ఒకే విధంగా ఉండాలన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా ఐయజ్ గుర్తింపు పొందిన మోడల్ సచివాలయాలను ఆదర్శంగా తీసుకుని, అదేవిధంగా అన్ని సచివాలయాలను రూపుదిద్దాలన్నారు. 10 రోజుల్లోపు సచివాలయంలో డిస్ ప్లే బోర్డులను ఏర్పాటు చేసి ఆయా సచివాలయాల ఫొటోలను సమర్పించాలని యంపిడిఓలను కలెక్టరు ఆదేశించారు. జిల్లాలో 95 శాతంకు తగ్గకుండా బయోమెట్రిక్ విధానం అమలయ్యేలా చూడాలన్నారు. ముందస్తు అనుమతి లేకుండా వీడియోకాన్పరెను గైర్హాజరు అయిన మండల ప్రత్యేకాధికారులకు షోకాజ్ నోటీసులను జారీ చేయాలని జిల్లా కలెక్టరు సంబంధిత అధికారులను ఆదేశించారు.

Check Also

రాష్ట్రంలో 6 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల ఫీజిబులిటీ స్టడీ కోసం రూ. 2.27 కోట్ల నిధులు విడుదల చేయనున్నాం : మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

-కుప్పం, శ్రీకాకుళం, నాగార్జునసాగర్, తుని – అన్నవరం, తాడేపల్లి గూడెం, ఒంగోలులో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల అభివృద్ధికి ప్రతిపాదనలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *