విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పోవర్టి (సెర్ప్) రాష్ట్ర చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఏ.యండి. ఇంతియాజ్ పదవిబాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుతం మైనారిటీ సంక్షేమ శాఖ రాష్ట్ర సంచాలకులుగా పనిచేస్తున్న ఆయనను సెర్ప్ సిఇఓగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు ఏ.యండి. ఇంతియాజ్ గురువారం విజయవాడ ఆర్టిసి అడ్మినిస్ట్రేటివ్ భవనంలో గల సెర్చ్ ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఎ గ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈసందర్భంగా పలువురు అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలను అందజేశారు.
