-రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు
పలాస, నేటి పత్రిక ప్రజావార్త :
సచివాలయ ఉద్యోగులు సిటిజన్ సర్వీసులను మెరుగుపరిచే విదంగా పని చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. పలాస తహశీల్దారు కార్యాలయంలో శుక్రవారం శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ సుమిత్ , నియోజకవర్గంలోని సచివాలయ డిజిటల్ ఆపరేటర్లు, వెల్ఫేర్ సెక్రటరీలు, విఆర్వోలు, ఎలక్ట్రికల్ అధికారులు, మండల అభివృద్ధి అధికారులు, తహశీల్దారు లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు గ్రామ స్థాయి పరిపాలన జరగాలని సచివాలయాలను స్థామించి ప్రతి పౌరుడికి ప్రభుత్వ సేవలు అందేలా చూడటమే ప్రధాన లక్ష్యంగా గ్రామ, వార్డు సచివాలయాలు స్థాపించి లక్షల ఉద్యోగాలు అందించేలా చూశారని అన్నారు. మరో ప్రక్క ప్రభుత్వ పధకాలు ఇంటింటికి అందించడానికి సచివాలయాలకు వాలంటీర్ల వ్యవస్థ అనుసందానం చేసి సమన్వయంతో ముందుకు పోయి ప్రగతి సాధించాలని ఆలోచన తో ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. కానీ ప్రభుత్వ లక్ష్యాలను సచివాలయ ఉద్యోగులు అందుకోవడం లేదని అందువలన పేద ప్రజలకు సంక్షేమం అందడం లేదని తీవ్ర ఆవేదన చెందారు. దాదాపు ఏడాదిన్నర పైగా అవుతున్నా ప్రజల సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని సమస్య ఎక్కడ ఉందో గుర్తించలేని పరిస్థితుల్లో పని చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు రేషన్ కార్డు, బియ్యం కార్డు, పించను మంజూరు తో పాటు వైసిపి ప్రభుత్వం అందిస్తున్న పలు పధకాలు ప్రజలకు అందక పోవడంపై పలు పిర్యాదులు అందుతున్నాయని అన్నారు. సచివాలయాల్లో పిర్యాదు చేసినా వారి సమస్యలు పరిష్కారం కావడం లేదని బాదపడుతుండటం చూసి ఒక మంత్రిగా చాలా ఆవేదనకు గురౌతున్నాను అని అన్నారు. గడ్డ దాటిన వరకు ఓరి మల్లన్న, గడ్డ దాటాక బోడి మల్లన్న అన్న చందంగా సచివాలయ ఉద్యోగులు తీరు ఉందన్నారు. ఉద్యోగం వచ్చే వరకు రాలేదని బాద ఉంటుంది ఉద్యోగం వచ్చాక బాధ్యతను మరచి ప్రవర్తిస్తుంటామని అన్నారు. ప్రతి విభాగానికి ఒక అధికారిని సచివాలయాల్లో నియమిస్తే ఎవరిపని వారు చేయలేక పోవడం వెనుక కారణాలు ఏమిటని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరు బాధ్యత మరచి ప్రవర్తిస్తున్నారని సమస్యలను గుర్తించకుండా పరిష్కరించే అవకాశం ఎలా దొరుకుతుందని ప్రశ్నించారు. ప్రతి ఒక్క ఉద్యోగి సక్రమంగా ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించాలని చెప్పారు. వాలెంటీర్ల ద్వారా లబ్ధిదారులకు వాహనాలు ఉన్నాయా లేదా, కరెంట్ మీటర్లు కనెక్షన్ వ్యవహారాలు, ఇన్ కామ్ ట్యాక్స్ వ్యవహారాలు ఇలాంటివి అన్ని గుర్తించడానికి ఒక్కో వాలెంటీర్ కు 50 ఇళ్లు పరిశీలన చేయమని ఇచ్చాము. వారిని సచివాలయ వెల్ఫేర్ ఉద్యోగులు పూర్తిగా ఉపయోగించుకుంటే ప్రతి కుటుంబం సమాచారం ఉంటుంది. కానీ అలా చేయడం లేదు. చాలా మందికి అనవసరంగా కొన్ని రకాల సమస్యలు ఎదురౌతున్నాయి. కొంత మందికి వాహనాలు ఉన్నట్లు, కొంత మందికి విద్యుత్ మీటర్ కనెక్షన్లు ఎక్కువ ఉండటం లేదంటే విద్యుత్ చార్జీలు ఎక్కువ చూపించడం, కొంత మందికి ఇన్ కమ్ ట్యాక్స్ ఉన్నట్లు చూపడంతో అనవసరంగా ప్రభుత్వ సంక్షేమానికి దూరం అయిపోతున్నారు. అలాంటి సమస్యలు గుర్తించి నిజమైన లబ్ధిదారునికి వారికి ఉన్న సమస్యలు తొలగించాల్సిన బాధ్యత ఎవరిది అని ప్రశ్నించారు. ప్రతి సంక్షేమాన్ని ప్రతి లబ్ధిదారునికి సరైన సమయంలో అందివ్వడమే ప్రభుత్వం ప్రధాన లక్ష్యం కదా అని తెలిపారు. పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా పనిచేయమని వెల్ఫేర్ సెక్రటరీని, డిజిటల్ కార్యదర్శిని, వీఅర్వోలను, జె.ఎల్.ఎమ్ 2 అను ఇలా ప్రతి ఒక్క విభాగానికి ఒక అధికారిని ఇచ్చి పనిచేయమని చెబుతుంటే పనిలో నిర్లక్ష్యం వహిస్తే పధకాలు ప్రజలకు ఎలా చేరుతాయని మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. ప్రతి ఒక్కరూ శ్రద్దగా పని చేసి గ్రామ పరిపాలన ప్రజలకు అందేలా చూడాలి. భవిష్యత్తులో గ్రామాల్లోనే అన్ని సర్టిఫికెట్ లు, సంక్షేమ అందించేలా చర్యలు తీసులుంటున్నామని అన్నారు. సచివాలయాలు ప్రజల సంక్షే అభివృద్ధికి, ఆర్థికాభివృద్ధికి ఆనవాల్లుగా మారుతాయని ఆదిశగా ప్రతివక్కరూ పని చేయాలని అధేశాలు ఇచ్చారు. ముందుగా కార్యక్రమం ప్రజల అవసరాలను ఎలా తీర్చాలి, సమస్యలను ఎలా గుర్తించాలి అనే విషయంపై ఉద్యోగులతో జిల్లా జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ కూలంకుశంగా వివరించారు. సచివాలయ ఉద్యోగులకు సమస్యల పరిష్కారం పై పూర్తి స్థాయి అవగాహన ప్రతి అధికారికి ఉండాలని కోరారు. గ్రామ స్థాయిలో సమస్యలను తొరగా పరిష్కరించి ప్రభుత్వ లక్ష్యాలను చేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో మూడు మండలాల మండల అభివృద్ధి అధికారులు, తహశీల్దారు లు, సచివాలయ వెల్ఫేర్, డిచిటల్, రెవెన్యూ విభాగాల అధికారులహ, మోటార్ వెహికిల్ తనిఖీ అధికారి, ఎలక్ట్రికల్ అధికారుల లతో పాటు పలువురు పాల్గొన్నారు.