విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ రెండవ డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రక్రియను ఎన్నికల ప్రిసైడింగ్అధికారి, జిల్లా కలెక్టర్ జె. నివాస్ నిర్వహించారు. ప్రక్రియ అనంతరం 58 వ డివిజన్ కార్పొరేటర్ అవుతు శ్రీశైలజారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అనంతరం ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని శ్రీశైలజారెడ్డి కి అందించారు. మంగళవారం విజయవాడ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో వియంసి రెండవ డిప్యూటీ మేయర్ ఎన్నికకు ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ కు చెందిన 46 మంది వార్డు సభ్యులు ప్రత్యేక సమావేశానికి హాజరు అయ్యారు. సమావేశ నిర్వహణకు కోరం సరిపోవడం తో రెండవ డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియను కలెక్టర్ నిర్వహించారు. కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో 58 వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ శైలజ పేరును 33వ డివిజన్ కార్పొరేటర్ వి.ఎన్.డి. ఎస్.ఎస్ మూర్తి ప్రతిపాదించగా, 17 వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి బలపరిచారు. మిగిలిన సభ్యుల నుంచి వేరే ప్రతిపాదన లేనందున, సభ్యుల ఆమోదంతో అవుతు శ్రీశైలజ ను వియంసి రెండవ డిప్యూటీ మేయర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి జె. నివాస్ ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రీశైలజ కి కలెక్టర్ జె. నివాస్ అభినందనలు తెలిపారు. ఈ సమావేశానికి హాజరైన దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తో పాటు , ఎమ్మెల్సీ యండి.కరిమున్నిసా, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వియంసి కమీషనర్ వి.ప్రసన్న వెంకటేష్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి,డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ, పొర్ల్ లీడర్ వెంకట సత్యనారాయణ నూతనంగా ఎన్నికైన రెండవ డిప్యూటీ మేయర్ శ్రీమతి ఆవుతు శ్రీ శైలజని పలువురు కార్పొరేటర్లు అభినందించి, శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేశారు.
Tags vijayawada
Check Also
4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు
-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …