Breaking News

మహిళల రక్షణ, భద్రత కొరకు దిశా చట్టం మరియు దిశా యాప్ వంటి రూపుదిద్దాం…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళల రక్షణ, భద్రత దృష్ట్యా ఆపద సమయాలల్లో వారికి సహాయకారిగా ఉండేందుకు రూపొందించిన దిశా యాప్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర మహిళా భివృద్ది, శిశు, దివ్యంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. స్థానిక యువరాజ్ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం మహిళల భద్రత మరియు రక్షణ కొరకు రాష్ట్ర ప్రభుత్వం వారు రూపొందించిన దిశా యాప్ పై జిల్లా స్థాయి అవగాహన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి  ఆధ్వర్యములో మహిళల రక్షణ, భద్రత కొరకు దిశా చట్టం మరియు దిశా యాప్ వంటి రూపుదిద్దామన్నారు.  మహిళా పక్షపాతిగా మన ముఖ్యమంత్రి పదవుల్లో 50 శాతం మహిళలకు అందచేస్తున్న తీరే నిదర్శనం అన్నారు. మహిళల రక్షణ కొరకు ఈ ప్రభుత్వం ఎల్లవేళల ముందు ఉంటుందని తెలిపారు. దిశా యాప్ అనేది మహిళల చేతిలో ఉన్న ఆయుధం లాంటిదని, ఆపద సమయాలలో రక్షణ కొరకు మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. మహిళలను వేధించిన , దాడులు చేసిన కఠినంగా శిక్షించాలని చట్టాన్ని తీసుకుని వొచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి రావాల్సి ఉంది. రాష్ట్రంలో 18 మహిళా పోలీస్ స్టేషన్ లు ఏర్పాటు చేశారు. కావున అందరూ ఈ దిశా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని, మీరు ఇంకో పదిమందికి చెప్పి ఈ యాప్ పట్ల అవగాహన కల్పించాలని ఆమె తెలిపారు. మహిళలు పట్ల గౌరవభావం ఉండాలని, కానీ కొందరు మహిళలపై దాడులు చెయ్యడం హేహ్యమైన చర్య గా మంత్రి పేర్కొన్నారు. దిశా చట్టాన్ని అపహాస్యం చేసేలా వాక్యాలు బాధాకరం, కానీ ఏ మహిళా రాష్ట్రంలో ఇబ్బందులు పడకూడదనే దిశా చట్టం / యాప్ ఒక ఆయుధంగా తీసుకుని వొచ్చాము. SOS బట్టన్ నొక్కడం ద్వారా మహిళా భద్రత కు భరోసా ఇవ్వడం జరిగింది. మహాత్మా గాంధీ ఆడది అర్థరాత్రి తిరిగినప్పుడే నిజమైన స్వరాజ్యం అని చెప్పిన మాటలు ఈ రోజు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి పాలన లోనే చూస్తున్నామన్నారు.

కొవ్వూరు ఛైర్ పర్సన్ బావన రత్న కుమారి మాట్లాడుతూ, దిశా యాప్ అవగాహన కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్ధినులు, మహిళలకు మా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మహిళల భద్రత మరియు సంరక్షణ కొరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఒక అన్నా ల, తండ్రిలా ఆలోచనలకు మేరకు ప్రతిష్టాత్మకంగా దిశా యాప్ రూపొందించడం జరిగిందన్నారు. దిశయాప్ తప్పనిసరిగా మీ స్మార్ట్ ఫోన్ నందు డౌన్లోడ్ చేసుకోండి. దిశ చట్టంతో ఏర్పాటు తో పాటు దిశా పోలీసు స్టేషన్ పర్యవేక్షణ కోసం ప్రణాళికలు సిద్ధం చేసారు. గ్రామ వార్డు ఆధ్వర్యములోని వాలంటీర్లు ఈ యాప్ రాష్ట్ర వ్యాప్తిముగా మహిళలకు ఆపద సమయాలలో రక్షణ కల్పించడానికి ఏ విధముగా ఉపయోగవుడుతుందని, పోలీస్ శాఖ , మహిళ పోలీస్ సమన్వయంతో ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ దిశా యాప్ అనేది ఆపద సమయాలలో తప్పకుండా రక్షణ కల్పిస్తుందని కావున జిల్లా ప్రజలు తప్పకుండా ఈ దిశా యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని తెలిపారు.ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వలన కొద్దీ రోజుల క్రితం మన రూరల్ జిల్లాలోని నరసరావుపేట పట్టణములో ఒక మహిళపై తన భర్త దాడి చేయడం వలన తలకు బలమైన గాయం అయిందని,దిశ యాప్ ద్వారా స్థానిక పోలీస్ వారిని సంప్రదించగా వారు కేవలం 5 నిముషాలలో వెళ్లి సదరు మహిళను రక్షించడం జరిగినదని తెలిపారు. జిల్లాలో కూడా పలు సంఘటన జరిగిన సందర్భంలో పోలీసులు ఆయా సంఘటన జరిగిన చోటుకు చేరుకున్న ట్లు తెలిపారు. రూరల్ జిల్లాలోని మహిళలు అందరూ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని, పురుషులు కూడా చైతన్యం కావాల్సి ఉందని తెలిపారు.

పోలీస్ వారు ప్రజలకు సేవలు చేయడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ పేర్కొన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాడని పోలీస్ వారికి తోడ్పాటు అందించాలని ప్రజలను ఆయన కోరారు. సమాజంలో సగం మహిళలు ఉన్నారు. జూన్ 29 న దిశా యాప్ ను సిఎమ్ లాంచ్ చేశారు. నేరాలు జరిగే ముందే వాటిని నియంత్రిచాల్సి ఉంది, ఆ అస్త్రమే దిశయాప్ అన్నారు. మహిళాల భద్రత మనవంతుగా భాద్యత నిర్వర్తించాల్సి ఉంది. జిల్లా లో నిరంతరం దిశయాప్ ద్వారా క్షేత్రస్థాయిలో పోలీసు అధికారుల పనితీరును పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. దిశయాప్ ఒక వేపన్ లా పనిచేస్తుంది. పోలీసులకు ప్రజలకు మధ్య అంతరం తగ్గించే ప్రక్రియ లో భాగంగా దిశయాప్ ఒకటన్నారు. గత నెలలో 6.50 లక్షలు మంది దిశయాప్ డౌన్లోడ్ చేసుకోగా, 3, 292 కాల్స్ వొచ్చాయి, వాటిలో 3200 టెస్ట్ కాల్స్, 92 సహయం కోసం చేశారు. ప్రతి ఒక్కరూ ఈ యాప్ డౌన్లోడ్ చేసి పరీక్షించుకొండని తెలిపారు.

ఈ కార్యక్రమములో మహిళ పోలీస్ సిబ్బంది ముందుగా దిశా యాప్ అంటే ఏమిటి?.దానిని ఏ విధముగా డౌన్లోడ్ చేసుకోవాలి?.ఏ విధముగా ఉపయోగించుకోవాలి అనే వివిధ అంశాల గురించి,అదేవిధముగా దిశా చట్టం అంటే ఏమిటి? దిశా చట్టానికి మరియు నిర్భయ చట్టానికి మధ్య తారతమ్యాలు ఏమిటి అనేది వివరించడం జరిగినది.

దిశా యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వలన మన గోప్యతకు భంగం కలుగుతుంది, మన వ్యక్తిగత వివరాలు బహిర్గతం అవుతాయని ప్రజల్లో అపోహలు ఉన్నాయని మా దృష్టికి వచ్చిందని,అటువంటి అపోహలు ఎవరికైనా ఉంటే వెంటనే తమ మనసుల్లో నుండి తీసివేయాలని కోరారు.దిశా యాప్ ఉపయోగించడం వలన మనం ఎక్కడికి వెళ్తుంది అందరికి తెలుస్తుందని,అనేది అపోహ మాత్రమే కేవలం మీరు ఏదైనా ప్రదేశానికి ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ ట్రాక్ మై ట్రావెల్(Track my travel) అనే ఆప్షన్ నొక్కినప్పుడే మాత్రమే పనిచేయడం జరుగుతుందని,అదే విధముగా మా వ్యక్తిగత సమాచారం,ఫోటోలు,వీడియోలు వంటి వాటిని చూస్తుంది అనేది నూరుశాతం అపోహ మాత్రమే అని,మీరూ ఎవరితో ఫోన్ మాట్లాడుతూన్నారు అనేది కూడా ట్రాక్ చేయదు అని,ఈ దిశా యాప్ అనేది అత్యంత భద్రత ప్రమాణాలతో రూపొందించడం జరిగినదని కావున ఎవరు ఎటువంటి అపోహలకు పోకుండా మన రక్షణ కొరకు ఉపయోగించుకోవాలని తెలిపారు . ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మహిళలకు రక్షణ మరియ భద్రత కల్పించడానికి ప్రధమ ఆయుధంగా దిశా యాప్ నిలుస్తుందని చెప్పడములో సందేహం లేదని, ప్రజలకు ఏళ్ల వేళలా రక్షణ కల్పించాలని, మహిళల భద్రత మరియు సంరక్షణ పట్ల దృష్టి సారించాలని,ప్రజలకు శాంతి భద్రతల దృష్ట్యా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమములో డిఎస్పీ లు బి.శ్రీనాధ్, కె.లతా కుమారి, ఐసీడీఎస్ పీడీ విజయకుమారి, వైద్యాధికారి డా. కోటేశ్వరమ్మ, ఎస్సైలు, మహిళ పోలీస్ సిబ్బంది గ్రామ/ వార్డు సచివాలయ మహిళ పోలీస్ సిబ్బంది వివిధ కళాశాలల విద్యార్థినులు, అంగన్వాడీ, ఆశా ఇతర విభాగాలకు సంబంధించిన మహిళా పోలీసులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ వార్డు సచివాలయ మహిళా పోలీస్ సుజాత, కుమారి, విజయలక్ష్మి లు దిశా యాప్ ఉదేశ్యం వెల్లడించారు. సచివాలయంలో మహిళా పోలీస్ లకు మంచి గౌరవ మర్యాదలు వస్తున్నాయి. దిశయాప్ కేవలం మహిళలకే కాదు పురుషులకు కూడా భరోసా ఇస్తోందని తెలిపారు. మహిళలకు మనోధైర్యాన్ని ఇచ్చింది దిశయాప్ అనడంలో సందేహం లేదని తెలిపారు. 16 మంది మహిళా పోలీసులను మెమెంట్ తో సత్కరించారు. అనంతరం నిర్వహించిన పోలీస్ బుల్లెట్, స్కూటర్ ల అవగాహన ర్యాలీని మంత్రి, జెండా ఊపి ప్రారంభించారు.

Check Also

4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు

-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *