-పెద్దతండా గ్రామ ప్రజలతో పంచాయతీ ఛాంపియన్స్ సమావేశం
ఎ.కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎంపి కేశినేని శివనాథ్ ఆదేశాలకు మేరకు హైదరాబాద్ జాతీయ గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీ రాజ్ సంస్థ (ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్) లో సమగ్ర గ్రామీణాభివృద్ది కోసం శిక్షణ పొందిన పంచాయతీ చాంపియన్స్ ఎ.కొండూరు మండలం పెద్దతండా గ్రామంలో సమగ్రాభివృద్ది కోసం పనులు ఆదివారం ప్రారంభించారు. ఈ మేరకు డ్వాక్రా మహిళలు, గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ ప్రొగ్రామ్ కో-ఆర్డినేటర్ సొంగా సంజయ్ వర్మ, ఎ.కొండూరుమండల పార్టీ ప్రెసిడెంట్ గడ్డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) తన పార్లమెంట్ పరిధిలోని 295 గ్రామాలను సమగ్రంగా అభివృద్ది చేయాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నారని తెలిపారు. అలాగే ప్రజల స్వయం ఉపాధి కోసం కుటీర పరిశ్రమలు ఏ విధంగా స్థాపించుకోవాలి. కుటీర పరిశ్రమల్లో తయారు చేసే వస్తువులు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలనే అంశాలు సవివరంగా వివరించారు. ఈ విషయాలకు సంబంధించి పంచాయతీ ఛాంపియన్స్ గ్రామ ప్రజలకు అండదండగా వుంటారని చెప్పారు.
కుటుంబానికి ఒక ఎంటర్ ప్రెన్యూర్ వుండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయ సాధనలో భాగంగా స్వయం ఉపాధి రంగంలో మహిళలు, యువతను ప్రోత్సహించటంతోపాటు, వాటి పై అవగాహన కల్పించి ఆ దిశగా కుటీర పరిశ్రమల ఏర్పాటు చేయించాలనే ద్యేయంతో ఎంపి కేశినేని శివనాథ్ తన సొంత నిధులతో పంచాయతీ ఛాంపియన్స్ కు కేశినేని ఫౌండేషన్ ద్వారా శిక్షణ ఇప్పించారని తెలిపారు. పంచాయతీ ఛాంపియన్స్ కేంద్ర, రాష్ట్ర పథకాలు అర్హులు పొందెందుకు వారికి అవగాహన కల్పించి అండగా వుంటారన్నారు. పంఛాయతీ ఛాంపియన్స్ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) సూచనలు మేరకు గ్రామంలో మౌళిక సదుపాయాలు మెరుగుపర్చటం కోసం ఒక ప్రణాళికగా పని చేస్తారని వివరించారు.
అలాగే గ్రామంలో పంచాయతీరాజ్ వ్యవస్థను ఉపయోగించుకుని గ్రామాన్ని ఏ విదంగా అభివృద్ది చేసుకోవచ్చు అనే అంశాన్ని పంచాయతీ ఛాంపియన్స్ వివరించారు. పంచాయతీ ఛాంపియన్స్ జరబల శ్రీరామ్ లంబాడీ భాషలో ఎంపి కేశినేని శివనాథ్ సమగ్ర గ్రామాభివృద్ది కోసం చేస్తున్న కృషిని వివరించారు.
ఈ కార్యక్రమంలో పెద్దతండా గ్రామ పార్టీ అధ్యక్షుడు అమరసింగ్, మాజీ ఎ.ఎమ్.సి చైర్మన్ అలవాల రమేష్ రెడ్డి, ఎస్.ఎసి కార్పొరేషన్ డైరెక్టర్ వాసం మునియ్య, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి వనపర్ల డేవిడ్ రాజు, మండల ఉపాధ్యక్షుడు బరోతు పీక్లా నాయక్, జిల్లా రైతు సంఘం కార్యదర్శి పిన్నమనేని శ్రీనివాసరావు జిల్లా ఎస్టీ సెల్ జనరల్ సెక్రటరీ భాణవత్తు బీమానాయక్, మాజీ ఎ.ఎమ్.సి డైరెక్టర్ రామప్రసాద్ రెడ్డి, మండల సమైఖ్య అధ్యక్షురాలు చప్పిడి శ్రీలత, మండల బిసి సెల్ అధ్యక్షుడు బెజవాడ శంకర్, పంచాయతీ ఛాంపియన్స్ బత్తులవెంకట కృష్ణ, తరుణ్, పొద్దుటూరు కృష్ణ, తాజుద్దీన్, వసంతరావు, మేకల జాను, రమేష్, రామారావు, కొండ లతో పాటు డ్వాక్రా సంఘం మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News