జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
జగ్గయ్యపేట మండలము మరియు పట్టణము నందు శుక్రవారం సబ్-కలెక్టర్ విజయవాడ జి.సూర్య సాయి ప్రవీణ్ చంద్ ఐ.ఏ.ఎస్. జగ్గయ్యపేట పట్టణమునకు చెందిన పేదలకు 2 వ విడత ఇండ్ల పట్టాల పంపిణి నిమిత్తము 31.80 ఎకరముల ప్రవేట్ భూమిని సేకరించుటకు స్థల పరిశీలన చేసినారు. ముక్తేశ్వరపురం గ్రామములో అంతర్గ్రత జల రవాణా లో ముంపుకు గురి అగు భూమిని పరిశిలించినారు పేదలందరికీ ఇండ్లు పధకము క్రింద మంజూరు అయి నిర్మాణము చేపట్టిన 43 గృహములను పరిశిలించి లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణములో ఎదురయ్యే సమస్యల గురించి వారి నడిగి తెలుసుకోన్నారు. జగ్గయపేట పురపాలక సంఘ కార్యాలయములో మండలము మరియు పట్టణము లోని డాక్టర్లు, కోవిడ్ స్పెషల్ ఆఫీసర్స్ ఇతర వైద్య సిబ్బంది తొ ఫివర్స్ సర్వే గురించి మరియు మెగా గ్రౌన్దింగ్ మేళ గృహ నిర్మాణ పురోగతి గురించి సమీక్షించి అధికారులకు పలు సూచనలు మరియు ఆదేశములను ఇవ్వటము జరినది. మండల పరిషత్ అభివృద్ధి అధికారి టి.ఎస్.జయచంద్ర, తహసిల్దార్ రామ కృష్ణా, మునిసిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోష్, డిప్యూటి తహసిల్దార్ రామకృష్ణా, మెడికల్ ఆఫీసుర్లు, టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ లు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.