విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు విజయవాడ నార్త్ మండల పరిధిలో నిర్వహించిన “పౌర హక్కుల దినోత్సవం” కార్యక్రమానికి సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు 59వ డివిజన్ కార్పొరేటర్ షాహినా సుల్తానా తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు పౌర హక్కులపై అవగాహన కలిగి ఉన్నప్పుడే సమాజంలో మార్పు వస్తుందని గ్రామాల్లో అంటరాని తనం వంటి అమానుష మైన చర్యల కు పాల్పడే వ్యక్తులపై చట్ట పరమైన చర్యలుంటాయన్నారు. పౌర హక్కుల పరిరక్షణలో సామాజిక స్పృహ కలిగిస్తూ హక్కులకు ఎటువంటి భంగము కలగకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను, ప్రజా ప్రతినిధులను సూచించారు. ప్రతి నెలాఖరున వివిధ డివిజన్లలో మరియు వార్డులలో పౌర హక్కుల సభలో చర్చించి పరిష్కరించే దిశగా ప్రణాళికతో ముందుకు వెళ్లవలిసిందిగా అధికారులకు సూచించారు.నెలాఖరున జరిగే సంభందిత పౌర హక్కుల సభనందు విధిగా హాజరు అవుతానని తెలియచేసారు . ఈ కార్యక్రమంలో దళిత అభ్యుదయ సేవ సమితి సభ్యులు గురిందపల్లి చిట్టిబాబు, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, పోలీస్ శాఖ వారు, వార్డ్ రెవిన్యూ సెక్రటరీలు, వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు .
Tags vijayawada
Check Also
మస్టర్ పాయింట్లను ఆకస్మిక తనిఖీ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వార్డ్ సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు మస్టర్ సమయంలో తప్పనిసరిగా ప్రజారోగ్య కార్మికుల హాజరు …