విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
58 వ డివిజన్ కార్పొరేటర్ అవుతు శ్రీ శైలజ శ్రీనివాస రెడ్డిని డిప్యూటీ మేయర్ గా ప్రకటించిన తదుపరి శాసనసభ్యులు మల్లాది.విష్ణుని మర్యాద పూర్వకంగా వారి కార్యాలయంలో కలిసి తమకు కార్పొరేటర్ గా, డిప్యూటీ మేయర్ గా ప్రజా సేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ నగర అభివృద్ధి కొరకు అహరహం కృషి చేస్తానని తెలిపారు.
శాసనసభ్యులు మల్లాది విష్ణు మాట్లాడుతూ విజయవాడ నగర మునిసిపల్ కార్పొరేషన్ కి మేయర్, డిప్యూటీ మేయర్ గా మహిళలని ఎన్నిక చేసి,మహిళల మీద తమకి ఉన్న నమ్మకానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో సరి తెలిపారని అన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి మహిళ పక్షపాతి అని కొనియాడారు. గతం లో కార్పొరేటర్ గా చేసిన అనుభవం, నగర అభివృద్ధి మీద సరిఅయిన అవగాహన కలిగిన కారణం గా సీఎం జగన్ మోహన్ రెడ్డి అవుతు శ్రీ శైలజ శ్రీనివాస రెడ్డి కి డిప్యూటీ మేయర్ గా అవకాశం కల్పించారని అన్నారు. వైస్సార్సీపీ ప్రభుత్వం లో విజయవాడ నగరం చాల అభివృద్ధి చెందుతోందని ఇప్పుడు కార్పొరేషన్ లో కొలువై ఉన్న కౌన్సిల్ నీతికి, అభివృద్ధి కి కట్టుబడి ఉన్నదని అన్నారు. కొత్తగా భాద్యత తీసుకున్న అవుతు శ్రీ శైలజ శ్రీనివాస్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు.
