విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పారిశుద్ధ్య నిర్వాహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని అన్నారు ఇన్చార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ప్రజారోగ్య శాఖ ఇంచార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. సురేష్ బాబు, గురువారం ఉదయం కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని మీటింగ్ హాల్లో, లీడ్ వర్కులతో పారిశుధ్య నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇన్చార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ మాట్లాడుతూ నగరంలో పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని లోడర్ పాయింట్ల వద్ద లోడర్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రపరచాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక యాప్ APCMMS ( ఆంధ్రప్రదేశ్ కన్సిస్టంట్ మానిటరింగ్ ఆఫ్ మున్సిపల్ సర్వీసెస్) లో ప్రతిరోజు అప్డేట్ చేయాలని తెలిపారు. ఈ యాప్ లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం వచ్చిన కార్మికుల హాజరు, ఇంటి వద్దనే వ్యర్ధాల సేకరణ, ఒక్క సానిటరీ సెక్రటరీకి ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, వారి వద్ద నుండి చెత్త సేకరణ నిత్యం జరుగుతుందా లేదా వంటి విషయాలను ఈ యాప్ లో పొందుపరచాలని అన్నారు.
ఈ సమావేశంలో అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు డాక్టర్ బాబు శ్రీనివాస్, డాక్టర్ గోపీనాయక్, సానిటరీ సూపర్వైజర్లు, లీడ్ వర్కర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News