-కేంద్ర వాణిజ్య పరిశ్రమ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ వెల్లడి
-ఇంక్యుబేటర్స్ అండ్ స్టార్టప్స్ పై కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖను ప్రశ్నించిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ (SISFS) కింద దేశవ్యాప్తంగా 31 జనవరి 2025 నాటికి మొత్తం 217 ఇంక్యుబెటర్లు ఎంపిక చేయబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ లో 7 ఇంక్యుబెటర్లు , 46 స్టార్టప్ లు ఎంపిక అయ్యాయి. ఎంపికైన 7 ఇంక్యుబేటర్లకు రూ. 29.40 కోట్లు మంజూరు కాగా, రూ.16.15 కోట్లు నిధులు విడుదలయ్యాయి. 46 స్టార్టప్ లకు రూ.9.73 కోట్లు మంజూరు కాగా రూ.6.40 కోట్లు విడుదలయ్యాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ వెల్లడించారు.
స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ (SISFS) కింద 2021-2025 మధ్య దేశవ్యాప్తంగా ఎంపికైన ఇంక్యుబేటర్లు, స్టార్టప్ వివరాలు, ఎపి లో జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన ఇంక్యుబేటర్లు, స్టార్టప్ వివరాలు, మంజూరైన నిధులు, విడుదల నిధుల వివరాలు, ఎంపికైన స్టార్టప్ ల ద్వారా సృష్టించిన ఉద్యోగాల డేటా వివరాల తెలియపర్చాలంటూ విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ లోక్ సభలో మంగళవారం కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖను అడగటం జరిగింది. వీటికి కేంద్ర వాణిజ్య పరిశ్రమ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ పథకం ద్వారా ఏర్పాటు చేసిన ఇంక్యుబేటర్స్, స్టార్టప్ ల దేశ వ్యాప్తంగా 16,500కి పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు సృష్టించబడ్డాయని పేర్కొన్నారు. అలాగే ఈ పథకం పథకంలో నిధుల విడుదల ఆలస్యం, దరఖాస్తుల పరిశీలనపై వచ్చిన ఫిర్యాదులను సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (CPGRAMS) ద్వారా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
Prajavartha Online Telugu News