Breaking News

రైతుల పాలిట వరం – రైతు భరోసా కేంద్రాలు…

-కొవ్వూరు వ్యవసాయ శాఖ సబ్ డివిజిన్ పరిధిలో 92 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత జిల్లాలో ధాన్యాగారంగా ప్రసిద్ధి చెందిన పశ్చిమగోదావరి జిల్లా లో 70 శాతం మంది వ్యవసాయ, అనుబంధ రంగాలపై ఆధారపడి ఉన్నారు. ప్రతి గ్రామంలో వ్యవసాయ అనుబంధ రంగముల సమస్యలు పరిష్కరించాలని గ్రామస్థాయి లో ఒక వ్యవసాయ అధికారిని నియమించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు భరోసా గా నిలిచేందుకు రైతు భరోసా కేంద్రాలను మండలాల్లో ఏర్పాటు చేసి నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందుబాటులో ఉంచారు. వాటి నాణ్యత పరీక్షలు చేసి మండల కేంద్రాలకు వెళ్లకుండా వారి గ్రామంలో ని రైతులకు ఆర్బికే లు ఏర్పాటు చేశారు. రైతులు తమకు కావల్సిన సాంకేతిక పరిజ్ఞానం, పంటల మార్కెట్ విలువ, తదితర వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవొచ్చు. అర్భికేల లో వ్యవసాయ రంగం కు సంబంధించిన పుస్తకాలు, కరపత్రాలు, నెలవారీ మాసపత్రికలు అందుబాటులో తీసుకుని వొచ్చారు. శాశ్వత రైతు భరోసా కేంద్రా లను ఏర్పాటు చేసి శిక్షణా కార్యక్రమాలు, ప్రదర్శనలు, వ్యవసాయ పద్దతులపై అవగాహన కలిగించడం జరుగుతోంది. దృశ్య శ్రవణ మాధ్యమాల్లో శాస్త్రవేత్తలు, అధికారులు, నిపుణుల తో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతొంది. కొవ్వూరు వ్యవసాయ శాఖ సబ్ డివిజిన్ పరిధిలో 5 మండలాల్లో 92 గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చెయ్యడం జరిగింది. కొవ్వూరు మండలంలో 22, చాగల్లు లో 18, తాళ్లపూడి లో 15, దేవరపల్లి లో 21 , గోపాలపురం లో 18 గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆర్బికే లు ద్వారా భూసార పరీక్షలు నిర్వహించి, ఆయా భూములకు అవసరమైన పంటల వివరాలు ఎప్పటికప్పుడు రైతులకు తెలియ చేస్తున్నారు. ప్రకృతి వైప్యరీత్యాలు వలన జరిగిన నష్టాలను ఎప్పటికప్పుడు అంచనా వేసి, త్వరితగతిన ఇన్సూరెన్స్ అందించే విధంగా కృషి చేస్తున్నారు. రైతులకు మార్కెట్ అనుబంధ వివరాలు తెలియచేస్తూ రైతులను జాగురత చేస్తున్నారు. ఈ అర్భికేల ద్వారా ఉద్యానవన, పశు సంవర్థక శాఖ లకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంచుతున్నారు. గ్రామ స్థాయిలో రైతులు, అధికారులతో వ్యవసాయ కమిటీ లు ఏర్పాటు చేసి విలువైన సమాచారాన్ని సూచనలను ఎప్పటికప్పుడు రైతులకు అందచెయ్యడం జరుగుతున్నది. వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పి.చంద్రశేఖర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతులకు అండగా నిలిచి, స్థానికంగా, దేశీయ, అంతర్జాతీయంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలను తెలియ చెయ్యడం జరుగుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలిచేందుకు ప్రవేశ పెట్టిన వివిధ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు వివరాలను తెలియ పరుస్తూ అవగాహన కల్పించే దిశగా అడుగులు వెయ్యడం జరుగుతోంది. అర్భికేల ద్వారా ఈ-పంట నమోదు చేపట్టి ఆయా గ్రామాల పరిధిలో ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు, వేసిన పంటలు, వాటి వివరాలు (రకములు, విత్తిన తేదీ, సాగునీరు వసతి వంటివి) అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. పంటల సంరక్షణ కోసం పంట సీజన్, వాతావరణ పరిస్థితులు, సస్య రక్షణ చర్యలు పై సూచనలు, సలహాలు అందించడం జరుగుతోందని తెలిపారు.

Check Also

జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *