-సబ్ కలెక్టర్ జి ఎస్ ఎస్ ప్రవీణ్ చంద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ జి. ఎస్ ఎస్ ప్రవీణ్ చంద్ సూచించారు. సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం వరద ముంపు నివారణ చర్యల్లో భాగంగా నగరంలో ని భూపేష్ గుప్త నగర్, తారక రామనగర్, దోబీఘాట్, ఇంద్రకీలాద్రి రోడ్, పెనమలూరు , యన మలకుదురు ఇసుక ర్యాంప్ రోడ్ ప్రాంతాల్లో సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ పర్యటించారు. వరద నీరు 5 లక్షల క్యూసెక్కుల వరకు వుండే అవకాశం ఉన్న దృష్ట అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరద ముంపు నివారణ చర్యలు, పునరావాస కార్యక్రమల పై సంబందిత వి ఆర్ వోలతో మాట్లాడుతూ వాలంటీ ర్లను కో ఆర్డినేషన్ చేసుకొని ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు.ముఖ్యంగా పశువులను వరద నీటిలోకి వదలడం చేయరాదని, వాగులు వంకలు పొంగిపోర్లే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా వరద ప్రభావిత నివాసితులతో మాట్లాడుతూ వరదల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. సబ్ కలెక్టర్ వెంట ఆయా మండలాల తహసీల్దారర్లు తదితరులు పాల్గొన్నారు.