Breaking News

పి.వి.సింధు పోరాట పటిమకు జేజేలు… : పవన్ కల్యాణ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
టోక్యో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్యం గెలుచుకొని మన దేశానికి మరో పతకాన్ని అందించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధుకి నా తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నానని  జనసేన అధ్యక్షులు  పవన్ కల్యాణ్ కార్యాలయం నుండి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసారు. టోక్యోలో మన దేశ పతాకం మరోమారు రెపరెపలాడేలా చేసిన సింధుని చూసి దేశమంతా గర్విస్తోంది. అప్పుడు రియోలోనూ, ఇప్పుడు టోక్యోలోనూ… వరుసగా రెండు ఒలింపిక్స్ పోటీల్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారిణిగా సింధు సాధించిన రికార్డుతో క్రీడాభిమానులు మురిసిపోతున్నారు. ఒలింపిక్స్ వేదికపై సింధు పోరాట పటిమకు జేజేలు పలుకుతున్నారు. విజయం కోసం సింధు పోరాడిన తీరు, బ్యాడ్మింటన్ లో ఆమె ఎదిగిన విధానం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది. క్రీడా రంగంలో సింధు ఘన విజయాలు సాధించేలా తీర్చిదిద్దిన ఆమె తల్లితండ్రులు  విజయ,  పి.వి.రమణలకు, క్రీడా శిక్షకులకు అభినందనలు. పి.వి.సింధు భవిష్యత్తులో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నానన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్టీఆర్ జిల్లాలో ప్రత్యేక ఆధార్ సేవా శిబిరాలు

-ఆగస్టు 11 నుంచి 14 వరకు, ఆగస్టు 17 నుంచి 29 వరకు నిర్వహణ -జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మశ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *