
-త్వరలో కొల్లేరు పైన ర్యేగులేటర్, గరిసిపూడి వద్ద ర్యేగులేటర్ నిర్మాణాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు…
-ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్
-శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు
ముదినేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
చిరకాలంగా ఉన్న గ్రామ సమస్యను యంపీ నిధుల నుండి పరిష్కరించడం ఎంతో సంతృప్తినిచ్చిందని ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ అన్నారు. ఆదివారం సాయంత్రం ముదినేపల్లి మండలంలోని బొమ్మినంపాడు గ్రామంలో క్యాంబ్ బెల్ కాల్వ పై నాగమ్మ తల్లి గుడివద్ద నూతనంగా నిర్మించిన కాలిబాట వంతెనను స్థానిక శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు తో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తన ఎంపీ ల్యాండ్ నిధులు నుంచి రూ. 10 లక్షలు రూపాయలుతో స్వర్గీయ సత్యంబాబు కోరిక మేరకు వంతెనను మంజూరు చేయడం, ఇటీవలి శాసనసభ్యులచే శంకుస్థాపన చేయించడం తద్వారా అనతికాలంలోనే నిర్మాణం పూర్తి చేసి నేడు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. స్వర్గీయ సత్యంబాబు స్థానిక శాసనసభ్యులుడిఎన్ఆర్ తో మరియు నాతో ఎన్నికల ముందు చెప్పిన మాట నేడు నెరవేరిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహనరెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి హామీని తేదీల వారీగా అమలు చేస్తూ ప్రజల ఆశీస్సులు పొందుతున్నారన్నారు. శాసనసభ్యులు డిఎన్ఆర్ పట్టుదలతో కొల్లేరు పైన ర్యేగులేటర్, గరిసిపూడి వద్ద ర్యేగులేటర్ నిర్మాణాలకు గౌరవ ముఖ్యమంత్రి గారిచే శంకుస్థాపన చేయాలిసి వుందని అయితే కరోనా వలన కొంత ఆలస్యం అయ్యిందన్నారు. రాబోయే 3 నెలల్లో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆయా నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తామన్నారు.
శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన పరిపాలనలో మేము పని చేయడం మా అదృష్టం న్నారు. రాష్ట్రంలో కులం, మతం, రాజకీయం, వర్గాలకు అతీతంగా అర్హులు అయిన ప్రతి ఒక్కరికి నేరుగా వారి వారి బ్యాంక్ అకౌంట్ లోడబ్బులు వేస్తూ సంక్షేమ పధకాలు అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజలకు పరిపాలన నేరుగా అందాలని వాలంటరీల వ్యవస్థ,సచివాలయం వ్యవస్థ స్థాపించారు. ఒక్క కైకలూరు నియోజకవర్గానికే 12 వేల మంది అక్కచెల్లమ్మలకు ఇంటి పట్టాలు ఇచ్చారన్నారు.మీ శాసనసభ్యుడు ఎప్పుడూ కైకలూరు లో మీకు అందుబాటులో ఉంటానని, గ్రామావసరాలను నా దృష్టికి తెచ్చి నాతో పనులు చేయించుకోవాలన్నారు. అనంతరం కాల్వ పైన వంతెన నిర్మాణం త్వరగతిన పూర్తి చేసిన కాంట్రాక్టర్ విన్నకోట సుబ్బారావు కు శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో పీఆర్ డీఈఈ సురేష్, ఏఈఈ శ్రీనివాసరావు,సర్పంచ్ దారం సుధా, ఎంపీటీసీ దాసరి అరుణకుమారి, మండల అధ్యక్షులు బొర్రా శేషుబాబు, ఎంపీపి అభ్యర్థి రామిశెట్టి సత్యనారాయణ, కలిదిండి ఏఎంసీ చైర్మన్ నీలపాల వెంకటేశ్వరరావు, రాష్ట్ర మహిళా కార్యదర్శి నంబూరి శ్రీదేవి, పీఏసీఎస్ అధ్యక్షులు ఏర్రా శ్రీరాములు, మండల వ్యవసాయం సలహా చైర్మన్ కరేటి గోవిందరాజు, ఉల్లంకి నగేష్, ఏఎన్ బాబు, శీలం రామకృష్ణ, రెడ్డి సతీష్ బాబు, కోట సత్యనారాయణ, దాసరి చిరంజీవి, దాసి రంగారావు, పెటేటి కుమారి, పేరే రామకృష్ణ, పైడిపాటి వెంకటరమణ, నున్న కనకరాజు, పాతూరి ఆంజనేయులు, జాస్తి చంటి, చిన్నం అర్జునరావు, లేళ్ల ఆంజనేయులు, పాల్లంకి రాజేష్,బేతూ రాజా, బుసనబోయిన ఆంజనేయులు, నర్రా వెంకటేశ్వరరావు,, షేక్ అల్లా భక్షు, సాక్షి సాయిబాబు,ముత్యాలు రాంబాబు,మొట్రు ఏసుబాబు, పృథ్వి, ప్రవీణ్, నాని, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News