విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఎ.ఎస్ ఆదేశాల మేరకు సర్కిల్ -1 నందు జోనల్ కమిషనర్ డా.రవి చంద్ చే నిర్వహించిన స్పందన కార్యక్రమములో ఉద్యానవన విభాగమునకు సంబందించి 1 అర్జి సమర్పించుట జరిగింది. సర్కిల్ -2 నందు జోనల్ కమిషనర్ కె.వి.ఆర్.ఆర్.రాజుచే నిర్వహించిన స్పందన కార్యక్రమములో ప్రజారోగ్య శాఖ -1, పట్టణ ప్రణాళిక విభాగమునకు సంబంధించి-1 అర్జి మొత్తం 2 అర్జిలు సమర్పించుట జరిగింది. సర్కిల్ -3 నందు జోనల్ కమిషనర్ ఎల్.పార్ధసారధి చే నిర్వహించిన స్పందన కార్యక్రమములో రెవిన్యూ శాఖకు సంబందించి -3, ఇంజనీరింగ్ – 2, ఉద్యానవన శాఖ-1, ప్రజారోగ్య శాఖ -1, వి.ఏ.ఎస్-1 మొత్తం 8 అర్జీలు సమర్పించుట జరిగింది. పై సమస్యల అర్జిలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటిని పరిష్కరించాలని సంబందిత అధికారులకు సూచించారు.
Tags vijayawada
Check Also
4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు
-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …