Breaking News

సచివాలయ వ్యవస్థ పటిష్టపరచాలి, అధికారులకు కలెక్టర్ జె.నివాస్ ఆదేశం…

-స్పందనలో ప్రజల నుండి అర్జీల స్వీకరణ
-మూగ, బధిరులకు స్మార్టు ఫోన్లు అందజేసిన కలెక్టర్ జె.నివాస్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ మరింత సమర్ధవంతంగా పని చేసేలా బలపర్చాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లాధికారులతో కలెక్టర్ సమావేశమై జాయింట్ కలక్టరు (రెవెన్యూ) డా. కె. మాధవీలత, జెసి (డెవలప్మెంట్) ఎల్. శివశంకర్, జెసి (హౌసింగ్) ఎస్ఎన్. అజయ్ కుమార్, జెసి ( సంక్షేమం) మోహన్ కుమార్ లతో కలసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.

ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మండల ప్రత్యేకాది కారులు వారి మండలాల్లో రెగ్యులర్ గా పర్యటించాలని మండల సమస్యలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి సచివాలయం తనిఖీ చేయలన్నారు. ప్రభుత్వ డిప్ట్ నిబంధనలు అనుగుణంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలకు చెందిన సమగ్ర సమాచారంతో పాటు ఆయా పధకాల లబ్దిదారుల జాబితాలు ప్రదర్శించుటకు అనువుగా చెక్క హ్యా ంగర్లు అమర్చాలన్నారు. హ్యాంగర్ పైభాగంలో పధకం వివరాలతో పోస్టరు ఏర్పాటు చేసి దానిక్రింద హ్యాంగర్ కు లబ్దిదారుల జాబితా వ్రేలాడదీస్తు ప్రదర్శించాలని ఈ విధంగా ప్రతి సచివాలయంలో ఏర్పాట్లు చేయలన్నారు. ప్రతి మండలంలో నిబంధనల అనుగుణంగా డిస్ ప్లే చేసిన సచివాలయాలలో ఉత్తమ/మోడల్ సచివాలయాన్ని గుర్తించి ఆసచివాలయంలో ఆగస్టు 4న బుధవారం మిగత సచివాలయ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎంపిడివోలు, ఇవోఆర్ డిలు, మున్సిపల్ కమీషనర్లు శిక్షణ కార్యక్రమానికి విధిగా హాజరుకావాలన్నారు. గ్రామ/వార్డు సచివాలయాల్లో నూరుశాతం బయోమెట్రిక్ అమలు జరిగేలా చూడాలన్నారు. వివిధ పథ కాల మంజూరు, వివిధ రకాలైన సేవలు, ధృవపత్రాలు జారీ కోసం అందిన అర్జీలు సంబంధిత శాఖల అధికారులకు పంపునప్పుడు ఏ ధరఖాస్తు ఎవ్వరికి ఎప్పుడు పంపినది వివరాలు రిజిష్టరులో తప్పని సరిగా నమోదు చేయాలని అన్నారు. స్పందన అర్జీలు నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలన్నారు.
కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా ఫీవర్ సర్వే నిర్వహించాలని ప్రతిరోజు, ప్రతివాలంటీరు వారి పరిధిలో ప్రతి ఇంటిని సందర్శించి లక్షణాలు గల వారిని గుర్తించి ప్రతిరోజు నివేదికలు సమర్పించాలన్నారు.

మూగ, బధిరులకు టచ్ ఫోన్లు అందజేసిన కలెక్టర్…
స్పందన సమావేశంలో జిల్లా దివ్యాంగుల సంక్షేమశాఖ ద్వారా 10 మంది మూగ, బధిరులకు ఒకొక్కటి 15 వేలరూ.ల విలువైన స్మార్టుఫోన్లు కలెక్టర్ , జెసిలు అందజేశారు. సైల్యాం గేజి నిక్షిప్తం చేయబడి మూగ, బధిరులు వినియోగకరమైన ఫోన్లు కలెక్టర్ అందజేశారు.

కలెక్టరును కలసిన నూజివీడు శాసన సభ్యులు…
నూజివీడు శాసన సభ్యులు మేకా ప్రతాప్ అప్పరావు సోమవారం స్పందనలో జిల్లా కలెక్టరును కలసి నియోజక వర్గ సమస్యలు కలెక్టరుకు వివరించి పరిష్కరించాలని కోరారు.

స్పందన అర్జీలలో…
చల్లపల్లి మండలం ఆముదార్లంక గ్రామంలో 20 మందికి ఇళ్ల స్థలాల కోసం అర్హులుగా గుర్తించి లాటరీ ద్వారా ఇళ్ల స్థలాల ప్లాట్ల నెంబర్లు ఇచ్చారని, గ్రామసభలో అర్హుల జాబితాలో తమ పేర్లు చదివి వినిపించారని, కాని కొంత మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి మరికొంత మందికి ఆపారని అందరికి ఇళ్ల పట్టాలు ఇప్పించాలని కోరుతూ గరికపూడి రాధ తదితరులు జిల్లా కలెక్టరుకు అర్జీ సమర్పించగా చల్లపల్లి తహసిల్దారు ఈ అర్జీ వెరిఫై చేసి సమస్య పరిష్కరించాలని సదరు అర్జీ పై ఆదేశాలు ఇచ్చారు. జగ్గయ్యపేట మండలం బలుసుపాడు గ్రామానికి చెందిన వంగూరి ఆదాం తన తండ్రి, తాతలకు ప్రభుత్వం ఇచ్చిన భూమి ఆక్రమణకు గురైందని తన భూమి తనకు ఇప్పించి న్యాయం చేయాలని కలెక్టరుకు అర్జీ సమర్పించగా సంబంధిత తహసిల్దారుతో మాట్లాడి సమస్య పరిష్కార చర్యలు తీసుకుంటామన్నారు. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1వ డివిజన్ ఆనంద పేటకు చెందిన కనిగంటి రాజశేఖర్ తనకు గతంలో జిప్లి ఇల్లు మంజూరుకాగా, 25 వేలు చెల్లించానని ఇంత వరకు ఇల్లు ఇవ్వలేదని, నీకు ఇళ్ల స్థలం ఇచ్చామని అధికారులు చెపుతున్నారని స్థానిక గోసంఘంలో జిప్లవ్లి ఇల్లు ఇప్పించాలని కోరుతూ కలెక్టరుకు అర్జీ సమర్పించగా వెంటనే మచిలీపట్నం తహసిల్దారుతో కలెక్టరు మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. కోడూరు మండలం విశ్వనాధపల్లి శివారు వి.కొత్త పాలెం గ్రామంలో ఆర్ ఎస్ నెం. 648లో కోడి చెరువు అనే బంజారభూమిలో ఒక ఎకరం భూమి 42 ఏళ్లుగా సాగు చేసుకుంటూ ప్రభుత్వానికి శిస్తులు కడుతున్నామని, ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోసం తీసుకుంటున్నదని, మాకు ఇదే జీవనాధారం కాబట్టి మాభూమి వదిలి వేయాలని కోరుతూ బాదర్ల రాధారుక్మిణి అనే మహిళ జిల్లా కలెక్టరుకు అర్జీ సమర్పించారు. ఈ సమావేశంలో డిఆర్వో ఎం. వెంకటేశ్వర్లు, ఆర్ డివో ఎస్ఎస్ కె. ఖాజావలి, డ్వామా పిడి జి.వి. సూర్యనారాయణ, డిఆర్ డిఎ పిడి ఎం. శ్రీనివాసరావు, డిఎంఅండ్ హెచ్ వో డా. సుహాసిని, డిపివో ఎడి జ్యోతి, పిడి హౌసింగ్ కె. రామచంద్రన్ వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

వరద బాధితులకు విరాళాల వెల్లువ

-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *