మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు మరియు వారికి వివిధ రాయితీలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో భాగంగా ఇంతవరకు ఉద్యం రిజిస్ట్రేషన్ తీసుకొని సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు ఉద్యం రిజిస్ట్రేషన్ పోర్టల్ నందు నమోదు చేయడం కోసం జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో కానూరు న్యూ ఆటోనగర్ క్లస్టర్ భవనం నందు ఉద్యం రిజిస్ట్రేషన్ క్క్యాంప్ ఈ గురువారం నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమలు కేంద్రం జనరల్ మేనేజర్ ఆర్ వెంకట్రావు ముఖ్యఅతిథిగా పాల్గొని కేంద్ర ప్రభుత్వం వారు సూక్ష్మ చిన్న పరిశ్రమల ివృద్ధిలో భాగంగా RAMP ప్రోగ్రాం ద్వారా అందిస్తున్న వివిధ ప్రోత్సాహకాలను ఉపయోగించుకుని MSME సెక్టార్ అభివృద్ధి చెందాల్సిందిగా ఆకాంక్షించారు . ప్రభుత్వం వారు ప్రాధాన్యతా రంగంలోని MSME లకు అందించే వివిధ రుణ సదుపాయాలు మరియు సబ్సిడీల ద్వారా లబ్ధి పొందేందుకు ఉద్యం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి కావున ప్రతి పారిశ్రామిక మరియు వ్యాపారవేత్తలంతా తమ యూనిట్స్ కు సంభిందించి ఉద్యమం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా పొందాలని సూచించారు. ఇక ఈ కార్యక్రమంలో ఆటోనగర్ క్లస్టర్ మేనేజింగ్ డైరెక్టర్ అన్నే శివ నాగేశ్వరరావు మరియు ఇతర డైరెక్టర్లు పాల్గొని ప్రభుత్వం వారు అందించు సహకారం ఉపయోగించుకుని ప్రతి ఒక్కరు లబ్ధి పొందాలని సూచించారు
Prajavartha Online Telugu News