Breaking News

అక్రమణలు క్రమబద్దీకరించుటకు మార్గదర్శకములు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో పేదలు ఆక్రమించికొని అందు గృహ నిర్మాణము చేపట్టి తన నివాసయోగ్యమైన స్థలమును అక్రమణనలను క్రమ బద్దీకరణ విషయమై ప్రజల అభ్యర్ధన మేరకు ప్రభుత్వము నిశితముగా పరిశీలించిన తరువాత G.O.Ms. No. 30, తేదీ. 29.01.2025లో సదరు అనభ్యంతర అక్రమణలు క్రమబద్దీకరించుటకు మార్గదర్శకములు మరియు అక్రమణలు క్రమ బద్దీకరించుటకు ధరఖాస్తులు గ్రామ/వార్డు సచివాలయముల యందు ధరఖాస్తు చేసుకొనవలసిందిగా రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్ కృష్ణ నాయక్ గురువారం పేటలో తెలియజేశారు.

అర్హత కలిగిన లబ్దిదారులు కోసం ఇందు విషయమై రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకములు జారీ చేసినట్లు తెలియ చేశారు.

1. సదరు చట్టము దీవి 29.01.2025 నుండి అములులోకి వచ్చినది.

2. ఈ చట్ట ప్రకారము క్రమబద్దీకరణకు నిర్ధారించిబడిన తేదీ 15.10.2019 కు కానీ అంతకు ముందు కానీ ఈ చట్టము వర్తించును.

3. RCC రూఫ్ తో గాని యాజ్ పెస్టాస్ రేకులుతో కూడిన ఇటుకల ఇళ్ళు నిర్మాణం కలిగి ఉండవలెను.

4. ది.15.10.2019 కు ముందు కరెంట్ బిల్లు, ఇంటిపన్ను మరియు వాటర్ ట్యాక్స్ కలిగియుండాలి.

5. 150 చదరపు గజాల వరకు ఉచితముగాను, 151-300 చదరపు గజాల వరకు 15% బేసిక్ వాల్యు, 50% రిజిస్ట్రేషన్ రుసుము (BPL),

6. 151-300 చదరపు గజాల వరకు 15% బేసిక్ వాల్యు, సాదరణ రిజిస్ట్రేషన్ రుసుము (APL),

7. 301-450 చరరపు గజాల వరకు 100% బేసిక్ వాల్యు, 50% రిజిస్ట్రేషన్ రుసుము (BPL),

8. 301-450 చరరపు గజాల వరకు 100% బేసిక్ వాల్యు, సాదరణ రిజిస్ట్రేషన్ రుసుము (APL),

9. 451 నుండి అంతకన్నా ఎక్కువ చదరరపు గజాలు ఉన్నచో 5 రెట్లు ఎక్కువగా బేసిక్ వాల్యు (BPL/APL)

పై విధముగా రుసుము చెల్లించని యెడల అక్రమణలు (BPL/APL) తొలగించబడుననీ తెలియ జేయడమైనది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *