-నిధుల విడుదల చెయ్యడం జిల్లాకు రాష్ట్రంలోనే ప్రథమ స్థానం
-లబ్దిదారుల లో అవగాహనా కల్పించడంలో జిల్లాకు ద్వితీయ స్థానం
-జిల్లాలో మధ్యలో నిలిచి పోయిన ఇళ్ల నిర్మాణ లబ్దిదారులకు స్వయంగా కలిసి అవగాహాన కల్పించాలి
-కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహ నిర్మాణం కోసం అదనపు ఆర్ధిక సహాయం కింద 4, 240 మంది లబ్దిదారులకు రూ.6 కోట్ల 19 లక్షల మేర నిధులను విడుదల చెయ్యడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. గురువారం క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బందికి ఎఫ్ టి వో విడుదల చేసిన లబ్దిదారుల గృహ నిర్మాణాల పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో 21,584 మంది ఎస్సి ఎస్టీ బీసీ లకి చెందిన గృహ నిర్మాణ పనులను పూర్తి చెయ్యాల్సి ఉందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేద వర్గాలకు చెందిన స్వంత ఇంటి కల సాకారం చేసే లక్ష్యంతో ఎస్సి బిసి లకు రూ.50 వేలు, ఎస్టీ లకి రూ.75 వేలు, పి జి టీ (ట్రైబ్స్) కు రూ. ఒక లక్ష రూపాయలు మేర ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 8540 మంది లబ్దిదారులకు సమాచారం ఇచ్చి, క్షేత్ర స్థాయిలో 8,477 మందిని నేరుగా కలవడం, ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను వివరించడం జరిగిందన్నారు. వారిలో 5,678 మంది గృహ లబ్దిదారుల కుటుంబాలు అదనపు ఆర్ధిక సహాయం తో ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ముందుకు రావడం అభినందనీయం అన్నారు. వారిలో 4, 240 మందికి గృహ నిర్మాణం కోసం అవసరమైన అదనపు ఆర్ధిక సహాయం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు విడుదల చెయ్యడం జరిగిందన్నారు. అందులో ఎస్సి లు 1724 , బిసి లు 2,413 , ఎస్టీ లు 112 మంది ఉన్నారన్నారు.
రాష్ట్ర కొత్త ప్రభుత్వం ఏర్పడి జూన్ నెలకి ఒక ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో జిల్లాలో ఆరువేల గృహాలను పూర్తి చెయ్యాలని లక్ష్యం ఇవ్వడం జరిగిందన్నారు. రానున్న 24 గంటల్లో జిల్లా కు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చెయ్యాలని కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. ఇప్పటి వరకు 5,678 మంది ఇంటి నిర్మాణం కోసం ముందుకు రావడం జరిగిందని, వారిలో 363 మంది లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించే క్రమంలో రూ.52 లక్షల 45 వేలు జిల్లాకు నిధులను విడుదల చెయ్యడం జరిగిందన్నారు. నాలుగు దశల్లో ఇంటి నిర్మాణం సీ కోసం అదనపు ఆర్ధిక సహాయం మొత్తాన్ని దశల వారీగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నట్లు తెలిపారు. సచివాలయం స్థాయి లో సిబ్బంది గృహ నిర్మాణ లబ్దిదారులను కలిసి అవగాహనా కల్పించే క్రమంలో నిబద్ధత కలిగిన పనితీరు చూపడం ముఖ్యం అన్నారు. అంగీకారం తెలిపిన లబ్దిదారుల డేటా వెబ్సైట్ లో నమోదు చెయ్యాలని, ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ (ఎఫ్ టీ వో) జారీ చేస్తుందన్నారు.
ఇంఛార్జి జిల్లా హౌసింగ్ అధికారి ఎస్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, బేస్మెంట్, లింటల్ లెవెల్ కి రూ.15 వేలు చొప్పున, రూఫ్ లెవెల్ , రూఫ్ కంప్లీట్ స్థాయిల్లో రూ.10 వేలు , అదే దామాషా లో ఎస్టీ, పిజిటి లబ్దిదారులకు గృహ నిర్మాణ పురోగతి మేరకు నిధులను విడుదల చెయ్యడం జరుగుతుంది అని పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News