విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలంగాణ రాష్ట్రంలో గత టిఆర్ఎస్ ప్రభుత్వం తీసివేసిన గ్రామ రెవెన్యూ వ్యవస్థను మరలా పునరుద్దిస్తూ తెలంగాణలో 10,954 పోస్ట్లు జిపివోలుగా నియమిస్తూ జీవో నెంబర్ 41 ఇవ్వడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస రెడ్డి కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం. రాష్ట్ర అధ్యక్షులు. భూపతిరాజు రవీంద్ర రాజు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ తీసివేసిన తర్వాత అక్కడ రైతులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ లేకపోతే ప్రజలు, రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని పాదయాత్రలో ఆయన రాష్ట్రమంతా తిరిగినప్పుడు గ్రామ స్థాయిలో రైతులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి ఒక రైతు బిడ్డ గా ఆలోచించి తెలంగాణలో ఈరోజు గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడానికి గ్రామ పరిపాలన ఆఫీసర్ (GPO) గా నామకరణ చేస్తూ జీవో ఇవ్వడం వల్ల తెలంగాణలో ప్రజలకు రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, అలాగే మా విఆర్ఓ సోదర సోదరీమణులు, వీఆర్ఏ సోదర సోదరీమణుల కుటుంబాలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మా విఆర్ఓ, వీఆర్ఏ కుటుంబాలు రుణపడి ఉంటాయని మా తెలంగాణలో ఉన్న విఆర్ఓ, వీఆర్ఏ సోదరులు మాకు చరవాణి ద్వారా తెలియజేశారు అని పత్రిక ప్రకటన ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం. రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్ర రాజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అప్పలనాయుడు. తెలియజేశారు.
Tags vijayawada
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News