తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
పట్టణానికి చెందిన దర్శకుడు కనపర్తి రత్నాకర్ దర్శకత్వం వహిస్తున్న బాలల చిత్రం శిశిరం రెండవ షెడ్యూల్ షూటింగ్ ఆదివారం నుంచి ప్రారంభమవుతుందని రత్నాకర్ శనివారం తెలిపారు. ఆటోనగర్ లోని సూర్య శిల్పశాల, బుర్రిపాలెం రోడ్డులోని వివేకా సెంట్రల్ స్కూల్, జాగర్లమూడి, శేకూరు, కొలకలూరు లలో మూడురోజుల పాటు జరుగుతుందన్నారు. విద్య అవసరాన్ని, మారుతున్న విద్యా వ్యవస్థ, సాంకేతిక అభివృద్ధి ప్రధానాంశాలుగా చిత్రం వుంటుందన్నారు. చిత్రం లో ప్రముఖ చైల్డ్ ఆర్టిస్ట్ తండేల్ ఫేమ్ లిటిల్ స్టార్ భాను ప్రకాష్, మాస్టర్ పుష్కర్, బేబి అమృత, ప్రిహాన్స్ సిస్టర్స్ లతో పాటు బెల్లంకొండ వెంకట్, కనపర్తి మధుకర్, సోమేష్, కోటేశ్వరరావు, గోము, వసంత యామిని, తులసి, ప్రియాంక, డాక్టర్ జీవన లత, ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, రచయిత అయనాల మల్లేశ్వర రావు తదితరులు నటిస్తున్నట్లు రత్నాకర్ తెలిపారు. ఇప్పటికే ప్రసిద్ధ మ్యూజిక్ సంస్థ ఆదిత్య మ్యూజిక్ ద్వారా చిత్రం లోని పాటలు విడుదలయ్యాయి అని పాటలు సమాజ మాధ్యమాల్లో వైరల్ కావడం పై సంతోషం వ్యక్తం చేసారు. తెనాలి పట్టణానికి చెందిన యువ సంగీత దర్శకుడు శాండీ అద్దంకి సంగీతం సమకూర్చారు అని వివరించారు. కథ, స్క్రీన్ ప్లే వెంకట్ ప్రసాద్, డైరక్టర్ అఫ్ ఫోటోగ్రఫీ ఎం. మురళీ కృష్ణ, కెమెరా డి.మధు, స్టిల్స్ ఎస్.ఎస్.వి శేఖర్, డి. నాగరాజు, చరణ్ లు, ప్రొడక్షన్ డిజైనర్ ఎం. శ్రీకాంత్, కో డైరెక్టర్ రావూరి రమణ, ఆసియేట్ డైరెక్టర్ వర్ధన్ రాజ్ లు పనిచేస్తున్నట్లు తెలిపారు. శ్రీ కృష్ణ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్ లు గా వెంకట్ ప్రసాద్ అమిరినేని, సాదు చలపతి, కన్నెగంటి రవి, అనిల్ మూకిరిలు వ్యవహరిస్తున్నారన్నారు.
Prajavartha Online Telugu News