విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయాలి అనే లక్ష్యం తోనే తూర్పు నియోజకవర్గంలో జగనన్న బాటలో పరిష్కార వేదిక కార్యక్రమం చేపట్టినట్టు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు.మంగళవారం స్థానిక 12 వ డివిజిన్లో అయ్యప్పనగర్ ,51 వ సచివాలయం వద్ద డివిజిన్ ఇన్ ఛార్జ్ మాగంటి నవీన్ ఆధ్వర్యంలో జరిగిన పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న అవినాష్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన చివరి వ్యక్తి వరకు సంక్షేమ పథకాలు అందాలి అనేదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం అని ఆయన స్పూర్తితో నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలి అని,ఎవరికైనా ఏదైనా సాంకేతిక కారణాల వలన అర్హత ఉండి ఏదైనా పధకం రాకపోతే ఈ పరిష్కార వేదిక ద్వారా మా దృష్టికి తీసుకువస్తే వెంటనే సంబందిత అధికారులతో మాట్లాడి పరిష్కారం అయ్యేలా చూస్తామని భరోసా ఇచ్చారు.అదేవిధంగా డివిజన్ ని అభివృద్ధిపరచి మోడల్ డివిజిన్ గా తీర్చిదిద్దే బాధ్యత మా వైస్సార్సీపీ ప్రభుత్వానిదే అని తెలిపారు. ఇప్పటికే ఈ డివిజిన్లో కోటిన్నర రూపాయల వ్యయంతో గత కొంతకాలంగా అభివృద్ధి కి నోచుకోని అన్ని ప్రాంతాల్లో అంతర్గత రోడ్లు, సైడ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణాలు చేపట్టడం జరిగిందని తెలిపారు.ఇంతకుముందు కాలనీ ప్రజలు ఇదే ప్రాంతంలో నివసించే స్థానిక ఎమ్మెల్యే గద్దె దగ్గరకు వెళ్లి ఎన్నిసార్లు వినతిపత్రలు అందజేసిన పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.జగన్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో జనరంజకంగా పరిపాలన సాగుతుంటే వారి రాజకీయ మనుగడ కోసం,ప్రచార ఆర్భాటాలు కోసం టీడీపీ నాయకులు షో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వారు ఒకసారి జూమ్ నుండి బయటకు వచ్చి ప్రజల మధ్యకు వస్తే వారు ఎంత సంతోషం గా ఉన్నారో తెలుస్తోంది అని,వైసీపీ నాయకులు ప్రజలలోకి వస్తుంటే మహిళలు బ్రహ్మరథం పడుతున్నారు అని,వారి మోములో సంతోషం చూస్తుంటే చాలా గర్వంగా ఉందని, జగన్ గారే మరో 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా ఉండలని ప్రజలంతా కోరుకొంటున్నారు అని ఉద్ఘటించారు.మహిళల రక్షణకు ఈ ప్రభుత్వం పెద్దపీట వేసి దిశ ఆప్ రూపకల్పన చేసారని,ఆ ఆప్ ఆపద కాలంలో మహిళలకు అండగా నిలుస్తోంది అని అన్నారు.ప్రతి మహిళా దిశ ఆప్ వారి ఫోన్ లో పెట్టుకొనెల పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ,అవుతూ శైలజ,నాగవంశ డైరక్టర్ యర్నేటి సుజాత,కార్పొరేటర్లు భీమిశెట్టి ప్రవళ్ళిక,చింతల సాంబయ్య,తంగిరాల రామిరెడ్డి,రెహానా నాహిద్, డివిజన్ అధ్యక్షులు రిజ్వాన్, వైసీపీ నాయకులు ధనేకుల కాళేశ్వర రావు వల్లూరి ఈశ్వర ప్రసాద్,,కొత్తపల్లి రజిని,ఊకోటి రమేష్,కావటి దామోదర్,గల్లా రవి,బచ్చు మాదవి, తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు
-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …