Breaking News

కుక్కునూరు ప్రాంతంలో జేసి, పిఓ పర్యటన…

కుక్కునూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అర్హులైన నిర్వాసితులకు తగు న్యాయం చేస్తామని జాయింట్ కలెక్టర్ బి ఆర్ అంబేద్కర్ అన్నారు. మంగళవారం జాయింట్ కలెక్టర్ బి.ఆర్ అంబేద్కర్, ఐ టీ డీ ఏ పీవో ఓ.ఆనంద్ లు కుక్కునూరు మండలం లోని పోలవరం పొజెక్టు ముంపునకు గురి అవుతున్న 41.15 కాంటూర్ పరిధిలో వున్న కుక్కునూరు A బ్లాక్ , గొమ్ముగూడెం సీతారమపురం తదితర గ్రామాలలో పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా గోదావరి నది ఒడ్డున గల గొమ్ముగూడెం గ్రామానికి వెళ్లి ఇటీవల వచ్చిన గోదావరి ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ వున్నా గృహాలను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం గొమ్ముగూడెం ఊరిని అనుకుని ప్రవహిస్తున్న గోదావరి ప్రవాహ ఉధృతి అధికారులతో కలసి ఆయన పరిశీలించారు. 41.15 కాంటూర్ పరిధిలోని గ్రామాల ప్రజలు వారి సమస్యలను తెలియ చెయ్యటానికి కలిశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అంబేద్కర్ 41.15 కాంటూర్ పరిధిలో వున్నా నిర్వాసితుల గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో తీవ్రమైన గోదావరి వరదల ప్రమాదం పొంచివున్న నేపథ్యంలో వారిని ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలించే చర్యలు తీసుకోవాలని సూచించారు. గోదావరి వరదలకు ముందుగానే ఆర్&ఆర్ ప్యాకేజ్ పది లక్షల చెల్లించి తాడువాయి లో నిర్మిస్తున్న ఆర్&ఆర్ కాలనీలలో మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయి లో కల్పించి పునరావాస కాలనీలకు నిర్వాసితులను తరలించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు. గతంలో ఉన్నటువంటి నిర్వాసితుల అర్హుల జాబితా నుండి వివాహం అయినది అని, ఇక్కడ ఉండటం లేదని, చనిపోయారని అర్హులైన వారి పేర్లు తొలగించినట్లు పేర్కొన్నారు. వాస్తవాలను పరిశీలించి అర్హులు అయిన నిర్వాసితులను పై అకారణంగా అసంబద్ధమైన వాట్సాప్ మెసేజ్ ల వల్ల అన్యాయంగా తొలగించారని గ్రామస్థులు అధికారులకు వివరించారు. దీని వల్ల వాస్తవ నిర్వాసితులకు అన్యాయం జరిగిందాని, వారి పేర్లను మరొక్కసారి లోతుగా పరిశీలిన చేసి అర్హుల జాబితాలోకి నమోదు చెయ్యాలని జాయింట్ కలెక్టర్, పిఓ ఐటిడిఏ లకు వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది . సమస్య పై వెంటనే స్పందించిన జాయింట్ కలెక్టర్ పెండింగ్ లో ఉన్నటువంటి నిర్వాసితుల జాబితాను వెంటనే పరిశీలిన చేసి అర్హులైన వారికీ న్యాయం చెయ్యాలని అధికారులను జేసి అంబేద్కర్ ఆదేశించారు.

పిఓ ఐటిడిఏ ఓ. ఆనంద్ మాట్లాడుతూ, 41.15 కాంటూర్ లో వున్నా అవార్డ్ ప్రకటన జరిగిన గ్రామాలకు బిల్లులు చెల్లింపు వివరాలు నమోదు చేస్తున్నామన్నారు. పునరావాస కాలనీల్లో గృహాల నిర్మాణం కూడా చివర దశకు చేరుకుందని, గృహ నిర్మాణం పూర్తి అయిన వెంటనే ఆర్&ఆర్ సొమ్ములు జమచేసి అనంతరం పునరావాస కాలనీలకు తరలిస్తామని చెప్పారు. అదే విధంగా అన్ని ఆధారాలు వుండి అర్హుల జాబితాలో నమోదు కానీ వాస్తవ నిర్వాసితులను వివరాలు పరిశీలన చేసి వారికీ కూడా తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నిర్వాసితులు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కు, పిఓ ఐటీడీఏ వారికి ముంపు గ్రామాల్లో పర్యటించి మా సమస్యలు పరిష్కారం కోసం వొచ్చినందుకు అభినందనలు తెలిపారు. కివ్వక గ్రామం తరపున నిర్వాసితులు పడుతున్న సమస్యలును, ఏ పంట కూడా వెయ్యని పరిస్థితులను వివరించారు.

ఈ కార్యక్రమంలో కుక్కునూరు సర్పంచ్ రావు మీనా వినోద్, కుక్కునూరు మండల వైయస్సార్సీపీ అధ్యక్షులు కుచర్లపాటి నర్సింహారాజు, వైయస్సార్సీపీ సీనియర్ నాయకులూ మాదిరాజు వెంకన్న బాబు, కృష్ణమ్ రాజు, చిన్న నర్సింహ రాజుగ, మల్లేలా చంటి నాయుడు పగిల్లా అల్లేశ్ బృందం అధికారులను కలసి విజ్ఞాపన పత్రాలను అందచేశారు. ఈ పర్యటనలో తహశీల్దార్ రాజుకుమార్, సీఐ దుర్గ ప్రసాద్ , ఎస్ ఐ శ్రీనివాస్ , ఆర్ఐ లు, విఆర్ఓ లు , నిర్వాసిత ప్రజలు పాల్గొన్నారు.

Check Also

మాకు న్యాయం చేయండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల గృహ నిర్మాణ సంఘం పేరుతో ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మ్యూచువల్లీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *