మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము సాంఘిక సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖల ద్వారా ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఉచిత వసతి మరియు ఉచిత భోజనాది సదుపాయాలతో డీఎస్సీ శిక్షణను ప్రైవేటు శిక్షణ సంస్థలను గుర్తించి వాటి ద్వారా శిక్షణ ఇప్పించుటకు అన్ని ఏర్పాట్లు చేయడమైనది. మరియు “జ్ఞానభూమి పోర్టల్ మరియు https://mdfc.apcfss.in వెబ్ పోర్టల్‌లో వెబ్ ఆప్షన్స్ సర్వీస్ కూడా ప్రారంభించుట జరిగినది.
డైరెక్టర్ అఫ్ సోషల్ వెల్ఫేర్, ఆంధ్రప్రదేశ్, అమరావతి వారు ఆదేశముల ప్రకారం, జిల్లాలోని SC & ST అభ్యర్థులకు తెలియపరచుట ఏమనగా, ఉచిత DSC శిక్షణ తీసుకొనుట కొరకు ఫేజ్ -2 కు సంబంధించి, షార్ట్ లిస్టెడ్ (Shortlisted)లో ఎంపికకాబడిన SC & ST అభ్యర్థుల జాబితాను https://mdfc.apcfss.in వెబ్ పోర్టల్లో ప్రదర్శించబడింది అని తెలియపరుస్తూ, ఫేజ్ -2 క్రింద షార్ట్ లిస్టెడ్ లో (Shortlisted) ఎంపికకాబడిన SC & ST అభ్యర్థులందరూ తమ వెబ్ ఆప్షన్ సర్వీస్ ద్వారా “జ్ఞానభూమి” పోర్టల్ మరియు https://mdfc.apcfss.in వెబ్ పోర్టల్లో ఎంప్యానెల్డ్ కోచింగ్ సంస్థలకు ది. 28.03.2025 తేదీలోపు తమ ప్రాధాన్యతలను (Web Options) నమోదు చేసుకొనవలెనని తెలియపరచుట జరిగినది. మరియు మొదటి దశలో (ఫేజ్ -1) లో ఉచిత DSC శిక్షణ తీసుకొనుటకు అర్హులైన విద్యార్థులు వారు ఎంపిక చేసుకొనిన ఎంప్యానెల్డ్ కోచింగ్ సంస్థల ఎంపికను మార్చుకొనుటకు అవకాశములేదు అని స్ఫష్టముగా తెలియపరచటమైనది .
కావున, కృష్ణాజిల్లాకు సంబంధించి ఉచిత డీఎస్సీ శిక్షణను తీసుకొనుటకు, షార్ట్ లిస్టెడ్ (Shortlisted) ఫేజ్ -II లో, ఎంపికకాబడిన SC & ST అభ్యర్థులందరూ ది. 28-03-2025 తేది లోపు జ్ఞానభూమి” పోర్టల్ మరియు https://mdfc.apcfss.in వెబ్ పోర్టల్‌లో వెబ్ ఆప్షన్ సర్వీస్ ద్వారా ఎంప్యానెల్డ్ కోచింగ్ సంస్థలలో శిక్షణ తీసుకొనుటకు నమోదు చేసుకొనవలసినదిగా కృష్ణాజిల్లా, జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమం మరియు సాధికారత అధికారి శ్రీ షాహిద్ బాబు గారు పత్రిక ప్ ప్రకటన ద్వారా తెలియపరచటమైనది.
ఫేజ్ -2 ద్వారా ఎంపిక కాబడిన విద్యార్థులు, వెబ్ ఆప్షన్ ద్వారా నమోదు చేసుకొనుటకు గడువు తేది : 28-03-2025.
Prajavartha Online Telugu News