Breaking News

అభివృద్ధి సంక్షేమ ఫలాలు అర్హులైన లబ్ధిదారులకు చేరే విధంగా చర్యలు తీసు కోవాలి… : జిల్లా జాయింట్ కలెక్టర్ డా.బి.ఆర్. అంబేద్కర్  

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామ సచివాలయాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు అర్హులైన లబ్ధిదారులకు చేరే విధంగా చర్యలు తీసు కోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా.బి.ఆర్. అంబేద్కర్ అన్నారు. బుధవారం కొవ్వూరు మండలంలో వేములూరు గ్రామ సచివాలయాన్ని, మొబైల్ డెలివరి యూనిట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా, గ్రామ సచివాలయంలో పౌర సేవలను నిబద్ధతతో నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సిబ్బంది తో పేర్కొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం అర్హులైన కుటుంబాలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. వీటిని పారదర్శకంగా అమలు చెయ్యడంలో అర్హులైన లబ్ధిదారులకు పధకాలను చేరవేయ్యడంలో సచివాలయ సిబ్బంది అంకితభావంతో పనిచేయాల్సి ఉందన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా 35 ప్రభుత్వ శాఖల ద్వారా ప్రజలకు 500 లకు పైగా పౌర సేవలను పారదర్శకంగా లబ్ధిదారులకు చేరవేయ్యడం బాధ్యత గా అందించాలని అన్నారు. క్షేత్రస్థాయిలో వాలంటీర్ వ్యవస్థ సామర్ధ్యాలను పెంచుకునే దిశలో , స్థానిక ప్రజా ప్రతినిధులతో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయ్యాలన్నారు. అర్హులైన వారికి ప్రభుత్వం అందించే పధకాలను చేరవేసే బాధ్యత గ్రామ సచివాలయ లపై ఉందన్నారు. ప్రతి సచివాలయంలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితాను నోటీసు బోర్డు ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ గ్రామ సచివాలయాలు ప్రజలు సద్వినియోగం చేసుకోనేలా చైతన్యం తీసుకుని రావాలని సూచించారు. శానిటేషన్, గృహాల లబ్ధిదారులగుర్తింపు , ప్లానింగ్, మహిళా భద్రత కార్యదర్శి లను వారుచేసే విధుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇంటింటికీ రేషన్ సరుకులు అందచేసే మొబైల్ డెలివరీ యూనిట్ ను పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు. జాయింట్ కలెక్టర్ వెంట ఆర్డీవో డి.లక్ష్మారెడ్డి, ఎంపిడిఓ పి.జగదాంబ, ఎమ్మార్వో బి.నాగరాజు నాయక్ తదితరులు ఉన్నారు.

Check Also

గ్రామస్థాయిలో భూ వివాదాల పరిష్కారానికి వేదిక రెవెన్యూ సదస్సులు

-దొమ్మేరు రెవిన్యూ సదస్సు లో 30 అర్జీలు -కొవ్వురు ఆర్డిఓ రాణి సుస్మిత కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *