Breaking News

శాఖల మధ్య సమన్వయం చేసుకుంటూ సమస్య పరిష్కారానికి కృషి చేయాలి…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
హౌసింగ్ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా పూర్తి చేసే విధానంలో శాఖల మధ్య సమన్వయం చేసుకుంటూ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని జాయింట్ కలెక్టర్(రెవెన్యూ), కొవ్వూరు డివిజిన్ హౌసింగ్ స్పెషల్ అధికారి డా.బి.ఆర్.అంబేద్కర్ ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాలను చేపట్టి పూర్తి చెయ్యడం లక్ష్యంగా అడుగులు వేసి, ప్రగతి చూపాలన్నారు. బుధవారం స్థానిక పురపాలక సంఘం కార్యాలయ సమావేశ మందిరంలో కొవ్వూరు డివిజిన్ లోని గృహ నిర్మాణాలు, వాటి అభివృద్ధిపై హౌసింగ్ సబ్ డివిజిన్ స్థాయి అధికారులతో హౌసింగ్, ఆర్ డబ్ల్యు ఎస్, విద్యుత్తు, మునిసిపల్, రెవెన్యూ, పంచాయతీ రాజ్, తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హౌసింగ్ సబ్ డివిజిన్ స్థాయిలోని మండల పరిధిలో ని అధికారులు ఈరోజు కారోజు సమస్యలపై సమీక్ష నిర్వహించుకోవాలన్నారు. మండలస్థాయి, గ్రామస్థాయి లో వొచ్చే సమస్యలు మీరే పరిష్కరించాల్సి ఉందన్నారు. సమన్వయం తో కూడి హౌసింగ్ పనులు వేగవంతం చేయాలని, ప్రతిరోజు హౌసింగ్ డివిజిన్ స్థాయి అధికారులు సమావేశ నిర్వహించి సమావేశ వివరాలు తెలియచేయండని పేర్కొన్నారు. హౌసింగ్ నిర్మాణాల ను వేగవంతం చెయ్యడంలో తగిన ఏజెన్సీ గుర్తించి అనుమతులకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. డివిజిన్ లో 376 లే అవుట్ లకు 250 లే అవుట్ పూర్తి అయ్యాయని, 118 ప్రగతి లో ఉన్నట్లు తెలుపగా, వెంటనే పనులు ముమ్మరంగా చేపట్టి పూర్తి చేయాలని తెలిపారు. ఒక వారం సమయం ఇస్తున్నా, అప్పటికి మీలో సమన్వయం చేసుకుంటూ, పనులు వేగవంతం చెయ్యండని అంబేద్కర్ స్పష్టం చేశారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ (గృహ నిర్మాణం) జి.సూరజ్ ధనుంజయ్ మాట్లాడుతూ హౌసింగ్ కార్యక్రమం నిర్దుష్టమైన సమయంలో పూర్తి చేయాలని, దశల వారిగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. కాలనీల లో నిర్మాణాలు చేపట్టడానికి అనువుగా మౌలిక సదుపాయాల, రహదారుల నిర్మాణాలు చేపట్టవల్సి ఉందన్నారు. ఇంటి నిర్మాణాలకు అవసరమైన ఇటుక ఇసుక వంటి ముడి సరుకులు కూడా సిద్ధం చేసుకోవాలని సూచించారు. కొవ్వూరు రెవెన్యూ డివిజిన్ పరిధిలో 4 హౌసింగ్ సబ్ డివిజిన్ లలో లేఅవుట్స్ లలో 38519 గృహాలు, స్వంత స్థలాల్లో 15985 గృహాలు వెరసి 54504 మంజూరు చేశామన్నారు. వీటిలో ఇప్పటికే 43780 ఇళ్ల నిర్మాణం పనులు చేపట్టడం జరిగిందన్నారు. మండల వారిగా హౌసింగ్ కాలనీల్లో మౌలిక సదుపాయాలు, త్రాగునీరు, బోర్లు, విద్యుత్తు ట్రాన్స్ ఫార్మర్లు, వంటి అంశాల వారిగా , శాఖల వారిగా సమీక్షించి, తగిన సూచనలు చేశారు.గ్రామ, మండల స్థాయి సమావేశాలు నిర్వహించి, ఆర్ధిక చేయూత ను అందించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో కొవ్వూరు మునిసిపల్ ఛైర్ పర్సన్ బావన రత్నకుమారి, ఆర్డీవో డి. లక్ష్మారెడ్డి, పీడీ హౌసింగ్ టి. వేణుగోపాల్, ఆర్ డబ్ల్యు ఎస్, డి ఈ సిహెచ్ రమేష్, హౌసింగ్ డిఈ సి హెచ్ బాబురావు, మునిసిపల్ కమిషనర్ కేటి సుధాకర్, తహసీల్దార్ లు, ఎంపిడిఓ లు, హౌసింగ్ అధికారులు, , ఆర్ డబ్ల్యు ఎస్, విద్యుత్తు , మునిసిపల్, రెవెన్యూ, పంచాయతీ రాజ్, శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

రాష్ట్రంలో 6 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల ఫీజిబులిటీ స్టడీ కోసం రూ. 2.27 కోట్ల నిధులు విడుదల చేయనున్నాం : మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

-కుప్పం, శ్రీకాకుళం, నాగార్జునసాగర్, తుని – అన్నవరం, తాడేపల్లి గూడెం, ఒంగోలులో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల అభివృద్ధికి ప్రతిపాదనలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *