రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలను పురస్కరించుకుని జిల్లా ప్రజలకి శనివారం ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఉగాది శుభాకాంక్షలు తెలియ చేశారు. షెడ్రుచూలు కలియకతో ఉగాది పండుగ సందర్భంగా తయారు చేసుకునే ఉగాది పచ్చడి ఒక గొప్ప సందేశం ఇవ్వడం జరిగిందన్నారు. షడ్రుచులు ల కలయిక తో కూడిన మధురం అనగా తీపి, ఆమ్లం అనగా పులుపు, లవణం అనగా ఉప్పు, కటువు అనగా కారం, తిక్తం అనగా చేదు, కషాయం అనగా వగరు లతో కలిసి ఉగాది పచ్చడి చేసుకుంటామన్నారు. ప్రజలు ఈ ఉగాది పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. శ్రీ విశ్వాసనామ సంవత్సరం అంతా మేలే జరగాలని జిల్లా ప్రజలకి, అధికారులకి, ప్రజా ప్రతినిధులకు, సిబ్బందికి ఉగాది శుభాకాంక్షలనీ కలెక్టరు పి. ప్రశాంతి తన సందేశం లో తెలియ చేయడం జరిగింది. స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా స్థాయి ఉగాది వేడుకలను ఉదయం 9.00 గంటల నుంచి ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోందని, ప్రతి ఒక్కరూ హాజరై వేడుకలను విజయవంతం చేయాలని కలెక్టర్ పి ప్రశాంతి కోరారు.
Prajavartha Online Telugu News