Breaking News

పేద ముస్లిం కుటుంబాలకి రంజాన్ తోఫా పంపిణి చేసిన గద్దె క్రాంతి కుమార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
5వ డివిజన్ అమ్మ కళ్యాణ మండపం ఎదురుగా ఉన్నా మస్జిద్ ఉమర్ వద్ద రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు టీడీపీ మైనార్టీ నాయకులు షేక్ షరీఫ్ ఏర్పాటు చేసిన 100 కిట్లను గద్దె క్రాంతి కుమార్ చేతుల మీదుగా ఆదివారం సాయంత్రం అందజేశారు. ఒకొక్క కిట్టు రూ. 800 విలువ చేసేవి 100 మందికి పంపిణి చేశారు.

ఈ సందర్భంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ గతంలో టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పేద ముస్లిం సోదరులకు రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకునేందుకు రంజాన్ తోఫా పేరుతో సరుకులు అందజేయడం జరిగింది అన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ పథకాన్ని నిర్వీర్యం చేశారన్నారు. మరల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని ఈ పథకాన్ని వచ్చే రంజాన్ నాటికి పునర్ ప్రారంభించే చర్యలు తీసుకుంటున్నారు అన్నారు. ఈ సందర్భంగా సరుకులు అందజేసిన నాయకులను గద్దె క్రాంతి కుమార్ అభినందించారు. అనంతరం జరిగిన ఇఫ్తార్ కార్యక్రమంలో గద్దె క్రాంతి కుమార్ ముస్లిం సోదరులతో కలిసి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్.కె హాసన్ జానీ, ఎస్. ఫిరోజ్, ఎం.డి ఈక్బాల్, ఎస్. కె.జమాల్, షేక్ షఫీ, కరీం, సిద్దెల వివేక్, ఎస్. అవినాష్ తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *