Breaking News

సెప్టెంబరు 1వ తేదీన పాలిసెట్-2021 ఎంట్రన్స్ పరీక్ష…

-ఈనెల 13వ తేదీవరకూ ఆన్ లైన్ ద్వారా ఎంట్రన్స్ పరీక్షకు ధరఖాస్తుల స్వీకరణ..
-10వ తరగతి పరీక్ష పాసైన వారందరూ ఎంట్రన్స్ పరీక్షకు అర్హులు…
-ఎంట్రన్స్ నిర్వహణకు రాష్ట్రంలో 380 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం…
-పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా పాలిటెక్నిక్ పాఠ్యాంశాలలో మార్పులు…
-రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనరు పోలా భాస్కర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యకు సంబంధించి 72 వేల సీట్లు భర్తీ చేయడానికి పోలీ సెట్ – 2020-21 ద్వారా ఎంట్రన్స్ నిర్వహిస్తున్నామని రాష్ట్ర సాంకేతిక విద్య కమిషనరు, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్ ఛైర్మన్ శ్రీ పోలా భాస్కర్ అన్నారు.
విజయవాడ సమీపంలోని గంగూరులో ధనేకుల ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాల్స్ సమావేశంలో పాలిటెక్నిక్ ఎ ంట్రన్స్ నిర్వహణా ఏర్పాట్లపై కమిషనరు సమీక్షించారు. ఈసందర్భంగా పోలా భాస్కర్ మాట్లాడుతూ పాలిటెక్నిక్ ఎ ంట్రన్స్ పరీక్ష సెప్టెంబరు 1వ తేదీన నిర్వహిస్తున్నామని ఇందుకు సంబంధించి రాష్ట్రంలో 380 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. ప్రతీ జిల్లాకు పరీక్షల నిర్వహణకు జిల్లా కోఆర్డినేటర్ ను నియమిస్తున్నామని ఆయన అన్నారు. 10వ తరగతి పాసైన విద్యార్ధులు అందరూ పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు అర్హులని ఆయన అన్నారు. జూలై 26 నుండి ఆన్ లైన్ ద్వారా ఎంట్రన్స్ పరీక్షకు ధరఖాస్తులను స్వీకరిస్తున్నామని, ఇప్పటివరకూ 30 వేలమంది ఆన్ లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకున్నారని, ఆన్ లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 13వ తేది ఆఖరు తేది అని చెప్పారు. కోవిడ్ నేపథ్యంలో అవసరమైతే ధరఖాస్తు స్వీకరణకు తేదీలు పొడిగిస్తామని ఆయన అన్నారు. రాష్ట్రం మొత్తంమీద పాలిటెక్నిక్ ఎ ంట్రన్స్ పరీక్షకు లక్షా 50 వేల మంది విద్యార్థులు హాజరు అవుతారని అంచనా వేస్తూ పరీక్షా నిర్వహణ ఏర్పాట్లు చేస్తున్నామని శ్రీ పోలా భాస్కర్ అన్నారు. రాష్ట్రం మొత్తం మీద 72 వేల సీట్లు పాలిటెక్నిక్ కళాశాలల్లో అందుబాటులో ఉన్నాయని ఇందులో 84 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు కాగా, 260 ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయని ఆయన అన్నారు. ప్రతీ పరీక్షా కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్, ఒక సూపరింటెండెంట్ ఉంటారని రాష్ట్రంలో 45 కోఆర్డినేషన్ సెంటర్లను ఏర్పాటు చేసామని ప్రతీ సెంటర్ కూ ఒక సీనియర్ అధికారిని అబ్జర్వర్ గా నియమించామని ఆయన అన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల అభివృద్ధికి ప్రణాళికాబద్ధ మైన చర్యలు చేపట్టామని ఇందులో భాగంగా క్వాలిటీ ఎ డ్యుకేషన్, క్వాంటిటీ ఎడ్యుకేషన్ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు పనిచేయాలని కళాశాలలప్రిన్సిపాలకు సూచించామన్నారు. ప్రతీ పాలిటెక్నిక్ కళాశాలలో ఆన్ లైన్ లెర్నింగ్ పై దృష్టి సారించే విధంగా విద్యార్థులను సమాయత్తం చేయాలని కమిషనరు అన్నారు. కోవిడ్ నేపథ్యంలో ఆన్ లైన్ క్లాలు కొనసాగించడానికి వీలుగా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నామని ఆయన అన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సాఫ్ట్ స్కిల్స్ పై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నామని, పాలిటెక్నిక్ కళాశాలలను పరిశ్రమలతో అనుసంధానం చేసి విద్యార్ధులకు క్షేత్రస్థాయిలో శిక్షణ ఇవ్వనున్నామని పోలా భాస్కర్ అన్నారు. రాష్ట్రంలోని 84 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇ-ఆఫీసు ప్రవేశ పెడుతున్నామన్నారు. పాలిటెక్నిక్ ప్రవేశపరీక్షకు సంబంధించి మేథమెటిక్స్ 50 మార్కులకు, ఫిజిక్స్ 40 మార్కులు, కెమిస్ట్రీ 30 మార్కులకు నిర్వహిస్తున్నామని మొత్తం 120 మార్కులకు గాను 25 శాతం మార్కులు అంటే 30 మార్క్ లు సాధించిన వారందరూ ఎంట్రన్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లేనని యసి, యటి విద్యార్ధులకు సంబంధించి పాస్ మార్కులపై పరిమితి లేదని ఆయన తెలిపారు. అనంతరం “పాలిటెక్నిక్ విద్యతో ప్రయోజనాలు ” పై పోస్టర్ ను, కరపత్రాలను, లఘుచిత్రంను సాంకేతిక విద్యాశాఖ కమిషనరు పోలా భాస్కర్ విడుదల చేశారు. ఈసమావేశంలో టెక్నికల్ బోర్డు సెక్రటరీ కె. విజయభాస్కర్, జాయింట్ డైరెక్టరు ఏ.నిర్మలాకుమార్ ప్రియ, జాయింట్ డైరెక్టరు జె. సత్యనారాయణమూర్తి, జాయింట్ డైరెక్టరు వి.పద్మారావు, జాయింట్ సెక్రటరీ బి. జానకి రామయ్య, జాయింట్ సెక్రటరీ కె. నారాయణరావు, 13 జిల్లాల పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాల్స్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Check Also

జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *