-ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న కాలనీల్లో నిర్మాణాలు ప్రారంభించిన ఇళ్లను త్వరగా పూర్తయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఆదేశించారు. కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో బుధవారం జగనన్న ఇళ్ల కాలనీ లేఅవుటను గృహనిర్మాణ, రెవెన్యూ, తదితర శాఖ అధికారులతో కలసి సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయడంతోపాటు ప్రారంభం గాని ఇళ్లను త్వరగా చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ లేఅవుట్ లో మంజూరైన 56 ఇళ్లల్లో 4 ఇళ్లు రూప్ లెవెల్ పూర్తి కాగా 26 ఇళ్లు బేస్మెంట్ స్థాయి పూర్తి అయిందన్నారు. మరో 17 ఇళ్లు రూప్ లెవెల్ స్థాయిలో పనులు ప్రగతిలో ఉన్నాయన్నారు. కాలనీలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వీరి వెంట కంచికచర్ల తహాశీల్దార్ వి.రాజకుమారి, గృహనిర్మాణ ఆర్ డబ్యుఎస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.