Breaking News

కరోనా వ్యాప్తి నియంత్రణకు ఫీవర్ సర్వే అత్యంత కీలకం… : కలెక్టర్ జె.నివాస్

-సచివాలయ సేవలను గడువులోగా పరిష్కరించండి….
-లబ్దిదారులకు సంతృప్తి స్థాయిలో సేవలందించండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కరోనా వ్యాప్తి నియంత్రణకు ఫీవర్ సర్వే అత్యంత కీలక మని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అన్నారు. నందిగామ అర్బన్ లోని మధిర రోడ్డులోని సచివాలయాన్ని బుధవారం నందిగామ శాసనసభ్యుడు డా. మొండితోక జగన్మోహన్ తో కలసి కలెక్టర్ జె. నివాస్ ఆకస్మీక తనిఖీ చేసి సచివాలయం ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న సేవల తీరును పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఫీవర్ సర్వే ఖచ్చితత్వంగా నిర్వహించడం ద్వారా అనుమానిత కేసులను గుర్తించి వారికి వైద్య సేవలు అందించేందుకు వీలవుతుందన్నారు. ప్రతిరోజు తప్పనిసరిగా ఫీవర్ సర్వేను నిర్వహించి సంబంధిత వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. కోవిడ్ లక్షణాలు ఉన్నావారిని గుర్తించడంతోపాటు వారికి అవసరమైన మెడికల్ కిట్లను అందజేయలన్నారు. అనుమానిత లక్షణాలు ఉన్నావారిని గుర్తించడంలో ఆయా కుటుంబసభ్యులకు కోవిడ్ పై అవగాహన కల్పించాలన్నారు. సచివాలయ ద్వారా గడువులోగా సేవలందించాలన్నారు. ప్రజలకు పారదర్శకమైన సేవలను సకాలంలో అందించేందుకు గౌరవ ముఖ్యమంత్రి సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనకు అనుగుణంగా సచివాలయనికి వచ్చే లబ్దిదారుల సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కరం చూపి వారి మన్ననలను పొందలని ఆయన సూచించారు. అర్హులైన లబ్దిదారులకు ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాల లబ్ది చేకుర్చాలన్నారు. ప్రభుత్వ పథకాల గురించి కూడా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సచివాలయంలో వివిధ రిజిస్టర్ల నిర్వహణ తీరును ఆయన పరిశీలించారు. వివిధ సేవల కింద అందిస్తున్న వివరాలను ఎప్పటికప్పుడు రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు. సచివాలయంలో ప్రభుత్వ సంక్షేమ క్యాలండర్, ప్రభుత్వం అమలు చేసే వివిధ సంక్షేమ కార్యక్రమాల వివరాలు, సేవలు వాటి నిర్దిష్ట కాల పరిమితి తేలిపే నోటీస్ బోర్డులో ప్రదర్శన తీరు బాగుందని కలెక్టర్ జె.నివాస్ సచివాలయ సిబ్బందిని అభినందిచారు. కలెక్టర్ వెంట తహాశీల్దార్ చంద్రశేఖర్, మున్సిపల్ కమీషనర్ డా. జయరాం, ఎంపిడిఓ లక్ష్మి లీలా తదితరులు పాల్గొన్నారు.

Check Also

వరద బాధితులకు విరాళాల వెల్లువ

-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *