-కేంద్ర ప్రణాళికా శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) రావు ఇంద్రజిత్ సింగ్ వెల్లడి
-ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ (ABP) పై ప్రశ్నించిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని), ఎంపి దగ్గుమళ్ల ప్రసాద్ రావు, ఎంపి. జి.లక్షీనారాయణ
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 500 ఆస్పిరేషనల్ బ్లాక్స్ ఉన్నాయి. ఇవి పెంచే ప్రతిపాదన ప్రస్తుతం లేదు. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాను ప్రస్తుత ప్రణాళికలో చేర్చటం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం 500 బ్లాక్స్ కే నిధులు కేటాయించిందని, కొత్త బ్లాక్స్ చేర్పు జరగాలంటే ప్రస్తుత ప్రణాళికలు- నిధుల పునర్విభజన జరగాల్సిన అవసరం వుందన్నారు. ఇప్పటికే ఎపిలో గుర్తించిన 15 బ్లాక్స్ ను వేగవంతంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర గణాంక , ప్రణాళికా అమలు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) రావు ఇంద్రజిత్ సింగ్ వెల్లడించారు.
విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని), ఎంపి దగ్గుమళ్ల ప్రసాద్ రావు, ఎంపి. జి.లక్షీనారాయణ కలిపి ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ (ABP) కి సంబంధించి ఎపిలో గుర్తించిన బ్లాక్స్ వివరాలు, మంజూరు చేసిన నిధులు, వినియోగించిన నిధులు వివరాలు తెలియపర్చాలంటూ లోక్ సభలో కేంద్ర ప్రణాళికా మంత్రిత్వ శాఖ అడిగిన ప్రశ్నకు బుధ వారం కేంద్ర గణాంక , ప్రణాళికా అమలు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) రావు ఇంద్రజిత్ సింగ్ లిఖిత పూర్వకంగా సమాధానం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ (ABP) కింద 7 జిల్లాల్లో 15 బ్లాక్స్ గుర్తించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా లో గంగవరం, మారేడుమిల్లి, వై.రామవరం, అన్నమయ్య జిల్లా లో కోడూరు, కురబలకోట, లక్కిరెడ్డిపల్లి, కర్నూల్ జిల్లాలో చిప్పగిరి, హోలగుండ, మడ్డికెర (ఈస్ట్), ఎన్టీఆర్ జిల్లాలో ఇబ్రహీంపట్నం, పెనుగంచిప్రోలు, పార్వతీపురం మాన్యం జిల్లాలో భామినీ, ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెం, వై.ఎస్.ఆర్ జిల్లా జిల్లాలో చింతకొమ్మదిన్నె, జమ్మలమడుగు ప్రాంతాల్లో బ్లాక్స్ గుర్తించినట్లు తెలిపారు.
ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ (ABP) కి సంబంధించి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రూ. 2.51 కోట్లు విడుదల చేయగా, రూ. రూ.48 లక్షలు వినియోగించినట్లు తెలిపారు. ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ (ABP) ప్రధానంగా శాసన పరిపాలనను మెరుగుపరిచేందుకు రూపొందించారని, ఈ ప్రోగ్రామ్ కింద ప్రతి త్రైమాసికం (Quarterly) కు 500 ఆస్పిరేషనల్ బ్లాక్స్ పనితీరును 40 కీలక పనితీరు సూచికలు (Key Performance Indicators – KPIs) ఆధారంగా మానిటర్ చేస్తారని తెలిపారు.
ఇవి ఆరోగ్యం- పోషణ, విద్య, వ్యవసాయం – అనుబంధ రంగాలు, సామాజికాభివృద్ధి, ప్రాథమిక మౌలిక సదుపాయాలు అనే 5 ముఖ్యమైన రంగాలకు సంబంధించినవని తెలిపారు. .ఈ ప్రోగ్రామ్ ద్వారా బ్లాక్ స్థాయిలో పాలనను మెరుగుపరచడం, పారదర్శకత తీసుకురావడం, అభివృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు.
Prajavartha Online Telugu News