మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రైతుల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికై రైతు స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బందరు ఆర్ డివో ఎస్ఎస్ కె. ఖాజావలి పేర్కొన్నారు. బుధవారం బందరు మండల తాసిల్దారు కార్యాలయంలో ” రైతు స్పందన” కార్యక్రమం నిర్వహించి ఆర్ డివో రైతుల సమస్యల పై అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్ డివో మాట్లాడుతూ జిల్లా కలెక్టరు ఆదేశాల మేరకు ప్రతి మండల కేంద్రంలో ప్రతి మొదటి మరియు 3వ బుధవారాల్లో రైతు స్పందన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతుల సమస్యలు అర్జీలు రూపంలో ఇస్తే స్వీకరించి 15 రోజుల్లో పరిష్కార చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. స్వీకరించిన అర్జీలకు రసీదు ఇవ్వడం జరుగుతుందని, వచ్చిన అర్జీలకు రిజిష్టరు నిర్వహిస్తారన్నారు. రైతులు వ్యవసాయ, ఇరి గేషన్, వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించిన సమస్యలు అర్జీల రూపంలో అందజేయాలని, రైతులు ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ అచ్చాబా, బందరు తాసిల్దారు డి. సునీల్ బాబు, మండల వ్యవసాయ, అనుబంద శాఖల అధికారులు పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలలోని ఉప- వర్గీకరణ పై విచారణ చేయడానికి ఏక సభ్య కమిషన్ నియమించిన సుప్రీం కోర్ట్
-ఏక సభ్య కమిషన్కు 2025 జనవరి 9 లోగా రిప్రజెంటేషన్స్ సమర్పించవచ్చు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ …