కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు అల్లూరి బాపినీడు, పెండ్యాల రంగారావు డిగ్రీ కళాశాల లో కొవ్వూరు, చాగల్లు, దేవరపల్లి, తాళ్లపూడి మండలాలకు నిర్వహిస్తున్న సర్పంచుల శిక్షణా కార్యక్రమం కు AP SIRD జాయింట్ డైరెక్టర్ వరప్రసాద్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు
ఈ సందర్భంగా సర్పంచుల నుద్దేశించి ప్రసంగిస్తూ శిక్షణ లో బోధించే అంశాలు మెలుకవలు శ్రద్ధ గా నేర్చుకుని గ్రామాల్లో సర్పంచులుగా విధి నిర్వ హణలో చిత్తశుద్ధి తో పనిచేసి పారిశుధ్యం, త్రాగునీటి సరఫరాలో శ్రద్ధ వహించి ప్రజల ఆరోగ్య భద్రతకు భరోసా ఇవ్వాలని తెలిపారు. స్వంత ఆదాయ వనరులు పెంచుకుని పంచాయతీ లను ఆర్ధికంగా బలోపేతం చేయాలన్నారు. కోవిడ్ నియంత్రణ కు గ్రామాలలో చర్యలు తీసుకోవాలని తెలిపారు. శిక్షణా కార్యక్రమంలో స్థానిక పరిపాలన, గ్రామ పంచాయతీ విధులు, భాద్యతలు, జగనన్న స్వచ్చ సంకల్పం మొదలగు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు డి ఎల్పీఓ భమిడి శివమూర్తి, DLDO పి.జగదాంబ, ఎం.ఓ.టీ.లు ఎ.వి.సుబ్బరాయన్, U రాజారావు, డి. చంద్రశేఖర్, ఈఓఆర్డీ కె.మెస్సయ్యరాజు, డి.పి.ఆర్.సి. డివిజనల్ కో ఆర్డినేటర్ ఎ. నాగరాజు, ఎఫ్.టి.సి. ఎన్. రామకృష్ణ , సర్పంచులు పాల్గొన్నారు.
Tags kovvuru
Check Also
4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు
-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …