Breaking News

75 ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో అత్యంత సుంద‌రంగా ఐలాండ్ పార్క్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
లెనిన్ సెంటర్ ఐలాండ్ పార్క్ ను మంత్రులు బోత్స‌స‌త్య‌నారాయ‌ణ‌ వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీకరీమున్నీసా, ఎమ్మెల్యే  మల్లాది విష్ణు, మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, డిప్యూటి మేయ‌ర్లు బెలందుర్గ‌, ఆవుతు  శైల‌జారెడ్డి, న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్ ప్రారంభించారు. 23వ డివిజన్ లెనిన్ సెంటర్ లో ఐలాండ్ పార్క్ ను 75 ల‌క్ష‌ల రూపాయ‌ల వ్య‌యంతో చిన్నారుల‌కు న‌చ్చేవిధంగా అత్యంత సుంద‌రంగా నిర్మించ‌డం జ‌రిగింద‌ని న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్ తెలిపారు. ఈపిడిఎం పొర్లింగ్‌తో భిన్న‌మై అకృత‌ల‌తో బొమ్మ‌ల‌ను పార్క్‌లో నిర్మించ‌డం జ‌రిగింద‌న్నారు.. ముఖ్యంగా చిన్నారుల పుస్త‌కాల చ‌దివే క‌థ‌ల‌ను బొమ్మ రూపంలో చేపే విధంగా బొమ్మ‌ల‌ను రూపొందించ‌డం జ‌రిగింద‌న్నారు. పిల్ల‌ల‌కు నీతి క‌థ‌లు గుర్తు చేసే విధంగా కుందేళ్లు, తాబెళ‌లు బొమ్మ‌లు, నీటిలో ముస‌లి, కోతి బొమ్మ‌లు, నీటి కుండ‌పై కాకి వంటి బొమ్మ అదే విధంగా పార్క్‌లో రాత్రి స‌మ‌యంలో అందంగా కాంతి నిచ్చేందుకు గాను ఒర్నమెంటల్ లైటింగ్స్తో పాటుగా పార్క్‌లో రెండు ఫౌంటైన్స్ ఏర్పాటు చేసిన్న‌ట్లు వివ‌రించారు. సంద‌ర్శ‌కులు కూర్చ‌నేందుకు బౌండరీ కం సీటింగ్ వాల్ ఏర్పాటు చేసిన్న‌ట్లు తెలిపారు. కార్యక్ర‌మంలో ప‌లువురు కార్ప‌రేట‌ర్లు సిఈ ఎం.ప్రభార‌రావు, ఎస్ఈ వై.వి కోటేశ్వర‌రావు, ఈఈ శ్రీ‌నివాస్, ఉద్యాన‌వ‌న శాఖ అధికారి జె. జ్యోతి, వీఎంసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు

-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *